దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఏఎల్ విజయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ టైటిల్‌ పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. . ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. కాగా త‌లైవి మూవీలోని మొద‌టి పాట‌ను మూడు భాష‌ల‌లో హిందీ వెర్ష‌న్‌లోని ‘చాలీ చాలీ` తమిళంలో `మజాయ్ మజాయ్` మరియు తెలుగులో `ఇలా ఇలా` పాట‌ను స‌మంత అక్కినేని రిలీజ్ చేశారు.  2021 ఏప్రిల్ 23న జీ స్టూడియో ద్వారా హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో తలైవి  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!