Shopping Cart 0 items - $0.00 0

నితిన్ మిస్సయ్యాడా?

 

 

 

బొమ్మ‌రిల్లు మూవీతో టాలీవుడ్‌లో విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకున్న హీరో సిద్దార్ధ్. ఒక్క తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా త‌న‌కంటే స్పెష‌ల్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో. సిద్దార్ధ్ హీరో కావ‌డానికి ఇన్‌డైరెక్ట్‌గా నితిన్ కూడా ఓ కార‌ణ‌మ‌నే చెప్పాలి. డైరెక్ట‌ర్ తేజ జ‌యం సినిమా అనౌన్స్ చేసిన‌పుడు నితిన్ ఫోటోల‌ను మీడియాకు రిలీజ్ చేసాడు. ఈ పిక్స్ వ‌ల్ల నితిన్‌కి వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన దిల్ మూవీలో అవ‌కాశం వ‌చ్చింది. దీంతో పాటు త‌మిళ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మూవీలో కూడా ఛాన్స్ వ‌చ్చింది. అంతేకాదు హైద‌రాబాద్‌కి వ‌చ్చి నితిన్‌తో ఆ మూవీ గురించి మాట్లాడారు శంక‌ర్. నితిన్‌ను శంక‌ర్ అడిగిన డేట్స్‌ను ఆల్‌రెడీ జ‌యం కు అడ్జ‌స్ట్ చేసాడు. సో ఆ విధంగా నితిన్ శంక‌ర్ లాంటి టాప్ డైరెక్ట‌ర్ మూవీలో సినిమా చేసే అవ‌కాశాన్ని మిస్ అయ్యాడు. ఇంత‌కీ ఆ సినిమా ఏంటంటే బాయ్స్. త‌మిళ, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజయిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో.. నితిన్ హీరోగా మిస్ కావ‌డం మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేస్తున్న సిద్దార్ధ ఈ సినిమాలో సెలెక్ట్ కావ‌డం జ‌రిగింది. ఈ మూవీ సిద్దార్ధ‌కు క్రేజ్‌తో పాటు ఆఫ‌ర్స్ ను కూడా తెచ్చిపెట్టింది.

Leave a comment

error: Content is protected !!