పవన్ కళ్యాణ్ మూడేళ్ళ విరామం తర్వాత కం బ్యాక్ మూవీగా ‘వకీల్ సాబ్’ సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ అభిమానులలో సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు శ్రీరాం వేణులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి అనుకున్న పేరు ‘వకీల్ సాబ్’ కాదు, ముందుగా అనుకున్న టైటిల్ ‘మగువా’, ట్యాగ్ లైన్ ‘లోకానికి తెలుసా నీ విలువ’ అని దర్శకుడు శ్రీరాం చెప్పారు.  ఐతే సినిమా హీరో పవన్ కళ్యాణ్ కావడంతో ఆ స్కేల్ కి ఈ టైటిల్ యాప్ట్ కాదని వకీల్ సాబ్ అనే టైటిల్ ఫైనల్ చేసారు చిత్ర యూనిట్.

 

 

Leave a comment

error: Content is protected !!