నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్లైమాక్స్’. విభిన్నమైన కథ, కథనాలతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ను విజయ్ మోడీగా నటించిన గెటప్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ థియేటర్‌లో ప్రదర్శించిన ఘనత అందుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ‘డ్రీమ్‌’ దర్శకుడు భవానీ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ క్లైమాక్స్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకొన్నది. ఏప్రిల్ రెండోవారంలో క్లైమాక్స్ సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

 

Leave a comment

error: Content is protected !!