పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ళ విరామం తరువాత తెరపై కనిపించనున్న మూవీ వకీల్ సాబ్. దాంతో వకీల్ సాబ్ మూవీ ట్రైలర్‌పై మెగా ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వకీల్ సాబ్ ట్రైలర్ థియేటర్ లో విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని పలు థియేటర్స్ దగ్గర తమ అభిమాన హీరోను థియేటర్ లో చూడాలనే ఆశతో అభిమానుల సందడి మాములుగా లేదు. దాదాపుగా సినిమా విడుదలైనట్లు సందడి చేశారు.

విశాఖపట్నంలోని సంగం థియేటర్ వద్ద తోపులాటలో సినిమా హాల్ అద్దాలు పగిలిపోయాయి. ఫ్యాన్స్ మధ్య తోపులాట జరగడంతో అద్దాలు ధ్వంసం కావడంతో పాటు కొందరు కింద పడిపోగా, తొక్కుకుంటూ లోపలికి పరిగెత్తడం కనిపించింది. పవన్ కళ్యాణ్ చిత్రం ‘వకీల్ సాబ్’ ట్రైలర్ లాంచ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు సంగం థియేటర్‌లో రావడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇక ఏప్రిల్ 9న విడుదలవుతున్న ఈ సినిమా పై అభిమానుల సందడి ఇక ఏరేంజ్ లో ఉండపోతుందో మరి కొన్ని రోజుల్లో తెలియబోతుంది.

Leave a comment

error: Content is protected !!