సినీ సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన సంగీత దర్శకుడు పద్మభూషణ్ ఇళయరాజా. 80 90 లలో ఇళయరాజా హవా కొనసాగింది. సినిమా రిలీజ్ టైమ్‌లో హీరోకు దీటుగా ఇళయరాజా కటౌట్స్ పెట్టిన సందర్భాలు చాలానే వున్నాయి. 1976లో ఓ తమిళ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇళయరాజా ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసాడు. అందులో కొన్ని రికార్డ్స్ మాత్రం అన్‌బిలీవబుల్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా 1984 మరియు 1992 సంవత్సరాల్లో ఇళయరాజా తెలుగు తమిళ మళయాళ కన్నడ భాషల్లో రికార్డ్ స్థాయిలో సినిమాలకు కంపోజ్ చేసాడు. ఎంతలా అంటే 1984, 92 సంవత్సరాల్లో ఏకంగా 54 సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇవన్నీ మ్యూజికల్ హిట్స్ కావడం విశేషం.