ప్రతి సంవత్సరంలానే ఉత్తమ చిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందచేసే జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం సందర్భం 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించింది కేంద్రం.
ఇందులో తెలుగు సినిమాకి సంభందించి ‘నాని’ కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలోను సినిమాకి ఎడిటరైన ‘నవీన్ నూలి’కి ప్రకటించింది. అలా తెలుగు సినిమాకి రెండు విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు వారించాయి. ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘గౌతమ్ తిన్ననూరి’ దర్శకత్వం వహించాడు.
ఉత్తమ పాపులర్ చిత్రంగా మహేష్ బాబు నటించిన “మహర్షి”అవార్డు సొంతం చేసుకోగా ఉత్తర కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం(మహర్షి)అవార్డును దక్కించుకున్నారు.
తమిళంలో ఉత్తమ చిత్రంగా ‘ధనుష్’ నటించిన `అసురన్` ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రంగా దివంగత ‘సుశాంత్ సింగ్’ రాజ్ పుత్ ప్రధానపాత్రలో నటించిన “చిచోరే”నిలిచింది.
జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణికర్ణిక) నిలిచింది. ఉత్తమ జాతీయ నటులుగా ‘ధనుష్, ‘మనోజ్ భాజ్ పాయ్’ అవార్డులను దక్కించుకున్నారు.
ఉత్తమ సినిమాటోగ్రఫీ‘జల్లికట్టు’ (మలయాళం) చిత్రం దక్కించుకుంది.