బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం ‘పింక్’. అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా నటించిన ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మాత. ఈ సినిమాను తమిళ్ లో అజిత్ తో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది.
తెలుగు రీమేక్ గా ‘వకీల్ సాబ్’ పేరుతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్న సందర్భంలో సినిమాకి సంభందించిన ప్రమోషన్లను భారీగా ప్రారంభించారు చిత్ర బృందం. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ‘వకీల్ సాబ్’ గురించి సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ…
గతేడాది ఆరంభంలో వచ్చిన అల వైకుంఠపురం లో… సినిమా అంతటి అఖండ విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదు. మ్యూజిక్ రంగంలో సక్సెస్ అరుదుగా వస్తుంది. అల వైకుంఠపురం లో… సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. అందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్. వారికి నా థ్యాంక్స్. కానీ ఆ సక్సెస్‌ను ఏడాదిపాటు ఎంజాయ్ చేసే స్కోప్ ఉండేది. కానీ లాక్డౌన్ కారణంగా ఎంజాయ్ చేయాలేకపోయాను అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు.
లాక్డౌన్ కు ముందు లాక్డౌన్ తర్వాత కూడా నేను చేసిన సినిమాలే ధియేటర్ లో విడుదలవడం యాదృచ్చికం. అలా ఈ ఏడాది ప్రారంభంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో థియేటర్లలో సందడి మొదలైంది. తర్వాత వచ్చిన ‘క్రాక్’ సినిమాకు మంచి సక్సెస్ లభించింది. ఈ సినిమా రీరికార్డింగ్, పాటలకు మంచి ఆదరణ లభించింది. అందుకు చాలా ఆనందంగా ఉంది అని తమన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పారిస్‌లో ‘సామజవరగమన’ పాట రికార్డింగ్ చేసే సమయంలో దిల్ రాజ్‌కు నన్ను పరిచయం చేశారు. వకీల్ సాబ్‌కు పనిచేస్తారని చెప్పారు. ఆవిధంగా త్రివిక్రమ్ గారి వల్ల వకీల్ సాబ్ సినిమా చేసే అవకాశం అలా వచ్చిందని తమన్ తెలిపారు. ఉండదు. అమితాబ్, అజిత్ చేసినప్పటికీ.. పవన్ కల్యాణ్ రేంజ్, ఆయన స్టార్డం, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కథలో చాలా మార్పులు చేసి పాటలకు, రీరికార్డింగ్ చేసే అవకాశం లభించిందని తమన్ పేర్కొన్నారు.