ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ కళ్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్రముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శకుడు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుద‌లకాన్నుంది.

‘వకీల్ సాబ్’ నుంచి మరో పాట వచ్చింది. ‘కంటి పాప’ అంటూ సాగే ఈ ప్రేమ గీతం పవర్ స్టార్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ తో అలరిస్తుంది. థమన్ కంపోజ్ చేసిన ట్యూన్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్, దీపు లతో కలిసి థమన్ పాటను ఆలపించారు.

‘‘కంటి పాప కంటి పాప.. చెప్పనైన లేదే

నువ్వంత‌లా అలా ఎన్ని క‌ల‌లు క‌న్నా…

కాలి మువ్వ కాలి మువ్వ స‌వ్వడైన లేదే

నువ్వెన్ని నాళ్లుగా వెంట తిరుగుతున్నా..’’

అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్‌పై హీరో త‌న ప్రేమ‌ను వ్యక్తం చేస్తున్నారు

లిరిక్స్ :

కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదే

నువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నా

కాలి మువ్వా కాలి మువ్వా… సవ్వడైనా లేదే

నువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా

నీరాక ఏరువాక… నీ చూపే ప్రేమలేఖ

నీలో నువ్వాగిపోకా… కలిసావే కాంతి రేఖ

అంతులేని ప్రేమ నువ్వై … ఇంత దూరం వచ్చినాక

అందమైనా భారమంతా… నాకు పంచినాకా

మొదలేగా కొత్తకొత్త కథలు

మొదలేగా కొత్తకొత్త కలలు

ఇకపైనా నువ్వు నేను బదులు

మనమన్నా కొత్తమాట మొదలు

కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదే

నువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నా

సాపమాప మాప మాగసామగరిసా

సాపమాప మాప మాగసామగరిసా

సుదతీ సుమలోచినీ సుమనోహర హాసిని

రమణీ ప్రియ భాషిణీ కరుణాగున భాసిని

మనసైన వాడిని మనువాడిన ఆమని

బదులీయవే చెలీ నువు పొందిన ప్రేమనీ

పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా

సాపమాప మాప మాగసామగరిసా

సాపమాప మాప మాగసామగరిసా

ఎదలో ఏకాంతము… ఏమయ్యిందో ఏమిటో

ఇదిగో నీ రాకతో… వెళిపోయింది ఎటో

నాలో మరో నన్ను చూశా… నీకో స్నేహితుణ్ని చేశా

కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా

ఆకాశం గొడుగు నీడ… పుడమేగా పూల మేడ

ఏ చూపులు వాలకుండా… ప్రేమే మన కోటగోడ

నాకు నువ్వై నీకు నేనై… ఏ క్షణాన్ని వదలకుండా

గురుతులెన్నో పెంచుకుందాం… గుండె చోటు నిండా

మొదలేగా కొత్తకొత్త కథలు

మొదలేగా కొత్తకొత్త కలలు

ఇకపైనా నువ్వు నేను బదులు

మనమన్నా కొత్తమాట మొదలు

మొదలేగా కొత్తకొత్త కథలు

మొదలేగా కొత్తకొత్త కలలు

ఇకపైనా నువ్వు నేను బదులు

మనమన్నా కొత్తమాట మొదలు

Leave a comment

error: Content is protected !!