కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి తర్వాత కూడా ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. కాజ‌ల్ న‌టించిన ‘మోస‌గాళ్లు’ చిత్రం మార్చి 19న విడుద‌ల కానుండ‌గా,  ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటుంది. మరోవైపు చిరంజీవి స‌ర‌స‌న ‘ఆచార్య’ అనే సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నాగార్జున నటించిన  ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా, తాజాగా ‘గరుడవేగ’ ఫేం దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుతో మరో సినిమా మొదలుపెట్టాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తొలిసారి కాజల్‌ అగర్వాల్‌ నాగార్జునకు జోడిగా నటిస్తోంది.ఇది వరకు సినిమాల కన్నా స్టైలిష్ లుక్ లో కనపడతాడని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ సినిమా పూజా కార్యక్రమంలో తెలిపాడు. ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్, శరత్ మరార్, పుస్కూరి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!