చిత్రం : జాతి రత్నాలు
నటీనటులు : నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, బ్రహ్మానందం , కీర్తి సురేష్, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి‌ తదితరులు.
సంగీతం : రాధన్
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్
ఎడిటింగ్‌ : అభినవ్ రెడ్డి
బ్యానర్ : స్వప్న సినిమా
నిర్మాత : నాగ అశ్విన్
క‌థ‌-మాట‌లు : అనుదీప్ కేవీ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అనుదీప్ కేవీ
విడుదల తేది : 11-03-2021

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, చిచోరే లాంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో విజయాన్ని పొంది సౌత్ లో మంచి క్రేజ్ ను పొందిన హీరో “నవీన్ పొలిశెట్టి “. ఈ హీరో  దర్శకుడు “అనుదీప్ కేవీ” చేసిన వినోదాత్మ‌క సినిమా “జాతి రత్నాలు”. ఈ సినిమాలో మురళి శర్మ, బ్రహ్మానందం, కీర్తి సురేష్, నరేష్ , బ్రహ్మాజీ  , వెన్నెల కిషోర్,  తనికెళ్ళ భరణి‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కి  నిర్మాత  నాగ అశ్విన్.  అలాగే, విడుద‌లైన టీజ‌ర్లు, ట్రైల‌ర్లకు, ప్రమోషన్స్ కి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు థ్రిల్ చేసింది ? నవీన్ పాలిశెట్టి, అనుదీప్ కేవీల‌కు హిట్ సినిమాగా నిలిచిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

కధ:  నవీన్ పొలిశెట్టి (జోగిపేట్ శ్రీకాంత్), ప్రియా దర్శి (శేఖర్), రాహుల్ రామకృష్ణ (రవి), ముగ్గురు జోగిపేట లో మంచి దోస్తులు. నవీన్ పొలిశెట్టి తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ దుకాణం ద్వారా, జోగి పేట లో నవీన్ పొలిశెట్టి కి లేడీస్ నుంచి మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఒకరోజు తండ్రి తో వాదన పెట్టుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వెళ్తుండగా, తన ఫ్రెండ్స్ కూడ వెళ్తారు. అలా, నవీన్ పొలిశెట్టి తెలిసిన ఒక వ్యక్తి ద్వారా, రిచ్ అపార్ట్మెంట్ లో ఎవరు లేని ఒక ఫ్లాట్ లో స్టే చేస్తాడు. అదే ఫ్లాట్ పక్కన ఉన్న నరేష్ కూతురు ఫరియా అబ్దుల్లా (చిట్టి) ని చూడగానే ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడతాడు. ఒక రోజు ఫ్రెండ్స్ అందరు కలిసి స్పోర్ట్స్ మినిష్టర్ “మురళి శర్మ” పార్టీ కి వెళ్తారు. ఆ పార్టీ ఫినిష్ అయ్యాక మురళి శర్మ కత్తి పోటుతో నవీన్ పాలిశెట్టి ఫ్లాట్ లోకి వచ్చి పడతాడు. తాగిన మైకం లో ఆ బాడీ ని చూసి నవీన్ పొలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు కార్ లో తీసుకుపోతుండగా పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేస్తారు. ఇర్రుక్కున్న, ఈ మర్డర్ కేసు నుంచి ఆ ముగ్గురు ఎలా బయటపడ్డారు ? అసలు మురళి శర్మ ని కత్తి పోటు ఎవ్వరు పొడిచారు ? ఎందుకు పొడిచారు ? ఈ కేసు నుండి బయటపడి ప్రేమించిన అమ్మాయిని పొందాడా లేదా..? ఆ మురళి శర్మ కత్తి పోటు వెనుకాల ఉన్నది ఎవరు అనే ఆసక్తికరమైన అంశాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విశ్లేషణ  : అనవసరపు కామెడి ట్రాక్స్ ఏమి లేకుండా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కామెడీ. ఫస్టాఫ్ లో మరి ఎక్కువా. కొన్ని సీన్స్ లో లాజిక్ మిస్ ఐనా మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో కామెడీ మ్యాజిక్ తో సినిమా గట్టెకించేసారు. సినిమాలో దాదాపు అందరూ కామెడితో కితకితలు పెట్టారు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :  ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి కామిడి టైమింగ్ అదిరిపోతుంది. నవీన్ ఫర్ఫార్మెన్సె ఈ మూవీ కి హైలెట్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా లో బ్రహ్మానందం నిడివి చాలా తక్కువైనా కామెడి అద్భుతంగా చేసారు. మురళి శర్మ, నరేష్ , బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి  ఇలా తమ పాత్రల కి న్యాయం చేసారు. ఇక హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా చిట్టి పాత్ర కి బాగా సూట్ అయ్యింది. 

టెక్నిషియన్స్ పనితనం : సినిమా లో చాలా వరుకు లాజిక్ లు మిస్ అయ్యిన సినిమా ఎగ్జిక్యూషన్ లో, హీరో హీరోయిన్ ఇతర ఆర్టిస్టుల నుండి మంచి నటనను రాబట్టుకోవడం. క్లైమాక్స్ వరుకు ప్రేక్షులని నవ్వించడం లో దర్శకుడు సక్సెస్ అయ్యారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన చిట్టి సాంగ్ సినిమా మొదటి భాగంలో బాగా వర్కౌట్ అయ్యింది. సన్నివేశాలకు తగ్గట్లు రాధన్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయ్యింది. సిద్ధం మనోహర్ చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది.

బోటమ్ లైన్ : పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన రత్నాలు

రేటింగ్ : 3.25/5

Review by :  Tirumalsetty Venkatesh

Leave a comment

error: Content is protected !!