పాత పాటలను రీమిక్స్ చేస్తూ‌ చాలా సినిమాలు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ వచ్చాయి. తాజాగా బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటించిన చిత్రం సత్యమేవజయతే’.  ఈ సినిమాలో దిల్బర్అనే పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ కెనడియన్‌ డ్యాన్సర్‌ నోరా ఫతేహి, జాన్‌ అబ్రహంపై ఈ పాటను చిత్రీకరించారు. నోరా ఫతేహీ నటించిన దిల్బర్ సాంగ్ యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దాంతో ఆమె 100 కోట్ల వ్యూస్ సాధించిన మొదటి ఆఫ్రికన్-అరబ్ యాక్టర్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌ని నోరా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ముంబైలోని టీ-సిరీస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి తన విజయాన్ని అందరితో కలిసి పంచుకుంది. అక్కడ చిన్నపిల్లలతో ఏర్పాటు చేసిన ఫ్లాష్ మాబ్‌లో వారితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ చిత్రానికి మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ పాటకు ఒరిజినల్ 1999లో వచ్చిన సిర్ఫ్‌ తుమ్చిత్రంలోనిది. పాత పాటలో నటి సుస్మితా సేన్‌ నర్తించారు. దీనిని సత్యమేవజయతేచిత్రంలో రీమేక్‌ చేశారు. ప్రస్తుతం ఈ పాటకు యూట్యూబ్‌లో 100 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. బిల్‌బోర్డ్స్‌ య్యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ పాట మూడో స్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు ఏ భారతీయ పాట కూడా ఆ స్థానాన్ని దక్కించుకోలేదని చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ పాటను తనిష్క్‌ బాగ్చి కంపోజ్‌ చేశారు. నేహా కక్కర్‌, ధ్వని భానుశాలి గాత్రం అందించారు. బాహుబలి: ది బిగినింగ్‌చిత్రంలో నోరా ఫతేహి మనోహరా..అనే పాటలోను ప్రభాస్ సరసన నర్తించింది.

 

Leave a comment

error: Content is protected !!