హ్యాపి బర్త్ డే టూ ‘జీనియస్ స్టోరీ టెల్లర్’ చంద్రశేఖర్ యేలేటి’
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది ప్రతిభావంతులైన దర్శకుల్లున్న తన మార్క్ తో స్క్రీన్ పై కథను చూపే విధానంలో మాస్టర్ ఆఫ్ స్క్రీన్ ఫ్లే, జీనియస్ స్టోరీ టెల్లర్ గా ఆడియన్స్ కు సినిమా చూసిన ప్రతిసారి ఒక నూతన అనుభూతిని కలిగించే దర్శకులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఆయన ఒకరు.
అలా మన తెలుగు పరిశ్రమలో ఎవ్వరైన ఉన్నారు అనే ఆలోచన మన మైండ్ లో రాగానే తన పేరు కోసం ఒకసారి ‘చెక్’ చేసుకుని.. ‘మనమంతా’ కలిసి చూసినా ‘అనుకోకుండా ఒక రోజు’ కలెక్షన్స్ కోసం బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమా చేసిన ‘సాహసం’ ఆ ‘ప్రయాణం’లో అలా వెతకగా.. ‘ఐతే’ అప్పుడు అలాంటి దర్శకుడు అంటూ ‘ఒక్కడున్నాడు’ అనే విషయం మన తెలుగు ప్రేక్షకులకు గుర్తుకువస్తుంది..! ఆయనే మన ‘చంద్రశేఖర్ యేలేటి’. ఈ రోజు ఆయన పుట్టినరోజు.
ఆయనకు పాత కథలకు ఉన్న రంగు, రూపు, వాసన & దుమ్ముధూళి విదిల్చి కొత్తజాడీలో మళ్ళీ ఆ పాత పచ్చడినే నింపే దర్శకుడు కాదు కనుకే కొత్త కథా కథనాల కోసం సంవత్సరాలు పట్టినా పర్లేదని ఎదురు చూసే దర్శకుడు యేలేటి. అలా అని కాకుండా ఇతర దర్శకుల వలె సినిమాలు చేసి ఉంటె తనకు ఇప్పుడున్న ఈ ప్రతిభా గుర్తింపు వచ్చేది కాదు. తను గుంపులో గోవిందా అన్నట్లు సినిమా చేసే వారు కాదు.
చంద్రశేఖర్ యేలేటి మార్చి 4, 1973లో జన్మించారు. గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన తెలుగు చలన చిత్రం ‘లిటిల్ సోల్జర్స్’లో సహాయ దర్శకునిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు . బుల్లితెర పై తెలుగు వారందరికి చక్కటి హాస్యం అందించిన కామెడి సీరియల్ ‘అమృతం’ కి మొదటి 10 ఎపిసోడ్ల వరకు దర్శకత్వం వహించారు . ఆ తర్వాత తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం పొందిన ‘ఐతే’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తరువాత ఆయన గోపీచంద్ కథా నాయకునిగా ‘ఒక్కడున్నాడు’ మంచు మనోజ్ కథానాయకునిగా ‘ప్రయాణం’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇలా చేసిన ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపించారు . ఈ సంవత్సరంలో నితిన్ హీరోగా ‘చెక్’ అంటు మరో నూతన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇలా మరెన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలని అందింస్తూ… సక్సెస్ఫుల్ గా కెరీర్ ఉండాలని కోరుకుంటూ హ్యాపి బర్త్ డే టూ ‘జీనియస్ స్టోరీ టెల్లర్’ చంద్రశేఖర్ యేలేటి’.