ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్స్ లో సూపర్ సీనియర్ ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఆలీ మాత్రమే. బాలనటుడిగా ఉన్నప్పటినుంచే కామెడీ చేసేవాడు కాబట్టి..అతడికి ఆ రేంజ్ లో సీనియారిటీని కట్టబెట్టడంలో తప్పులేదు. మంచి టైమింగ్ తో , వైవిధ్యమైన హావభావాలతో .. అతడు పండించే హాస్యానికి మన ఆడియన్స్ పడీ పడీ నవ్వుతారు. ఒక దశలో టాలీవుడ్ లో ఆలీ లేని సినిమానే ఉండేది కాదు. అయితే ఇప్పుడు అతడిని దాటుకుంటూ ఎందరో కమెడియన్స్ వచ్చేశారు. అయినా సరే అతడి స్థానం అతడిదే. ఆలీ మాత్రమే చేయగలడు అనే కామెడీ పాత్ర ఏదైనా ఉంటే.. అందరు దర్శకులూ ఆలీ వైపే చూస్తారు.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల్లో ఆలీ లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. లాస్టియర్ గోపీచంద్ ‘చాణక్య’ లో మాత్రమే కనిపించిన ఆలీ.. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఒక్క దాంట్లోనూ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. త్రివిక్రమ్ చిత్రాల్లో ఆలీ లేకపోవడం ఎప్పుడో కానీ జరగదు. అలాగే.. అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీలో ఆలీచేత కూడా కామెడీ చేయించొచ్చు. . అయినా సరే.. ఈ ఏడాది ఆలీ చిత్రం కనీసం ఒక్కటైనా రాకపోవడం.. విచిత్రమే. అయితే ఆలీ ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్లనే సినిమాలమీద అంతగా దృష్టిపెట్టడం లేదని, అంతే తప్ప అవకాశాలు లేక కాదని పలువురు చెప్పుకుంటున్నారు. మరి ఆలీ మళ్లీ టాలీవుడ్ లో ఎప్పుడు బిజీా అవుతాడో చూడాలి.