మధుబాలగా ప్రసిద్ధి చెందిన ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి, (1933 ఫిబ్రవరి 14 – 1969 ఫిబ్రవరి 23) ఒక ప్రసిద్ధ హిందీ చిత్ర నటి. ఆమె 1950లు మరియు 1960ల ప్రారంభంలోని అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు, వీటిలో ఎక్కువభాగం కావ్య స్థాయిని పొందాయి. అందుకే ఆమెను వెండితెర కావ్య రాణిగా అభివర్ణిస్తారు సినిసాహిత్య అభిలాషకులు. తన సమకాలికులైన నర్గీస్ మరియు మీనా కుమారిలతో పాటు, ఆమె అత్యంత ప్రతిభావంతులైన హిందీ చిత్ర నటీమణులలో ఒకరిగా విస్తృత గౌరవాన్ని పొందారు.
ముంతాజ్ యొక్క మొదటి చిత్రం బసంత్ (1942) బాక్స్-ఆఫీస్ వద్ద విజయవంతమైంది. ఆమె దానిలో ప్రసిద్ధ నటి ముంతాజ్ శాంతి యొక్క కుమార్తెగా నటించారు. బాలనటిగా ఆమె అనేక చిత్రాలలో నటించడాన్ని కొనసాగించారు. నటీమణి దేవికా రాణి ఆమె నటనకు మరియు సామర్ధ్యానికి ముగ్దులై ఆమెకు మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారు.
నిర్మాత కిదార్ శర్మ ఆమెను రాజ్ కపూర్‌కి ప్రతిగా నీల్ కమల్ (1947) చిత్రంలో నటింపచేయడంతో ఆమెకు గుర్తింపు లభించింది. ప్రధాన పాత్ర ధరించినపుడు ఆమె వయసు పద్నాలుగు సంవత్సరాలు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు, అయితే ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. తరువాత రెండు సంవత్సరాలలో, ఆమె ఒక ఆకర్షణీయమైన తారగా ఎదిగారు. బోంబే టాకీస్ చిత్రం మహల్ 1949లో ప్రధాన పాత్రను పోషించిన తరువాత, మధుబాల అత్యంత ప్రజాదరణ పొందారు. ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలే అయినప్పటికి, ఆమె సున్నిత మరియు నైపుణ్యంతో కూడిన నటన ఆమె ప్రసిద్ధ సహ-నటుడు అశోక్ కుమార్‌ను ఆకర్షించింది. ఈ చిత్రం మరియు దానిలోని “ఆయేగా ఆనేవాలా” అనే పాట ఇద్దరు సూపర్ స్టార్ల ప్రవేశాన్ని సూచించింది: మధుబాల మరియు నేపథ్య గాయని లతా మంగేష్కర్!
1950లో ఆమెకు “వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం( “గుండెలో రంధ్రం”గా పిలువబడే లోపం) ఉన్నట్లు కనుగొనబడింది. ఆమె ఆరోగ్య సమస్య కారణంగా మధుబాల కుటుంబం ఆమె పట్ల అత్యంత రక్షణతో ఉండేది. స్టూడియోలలో చిత్రనిర్మాణం జరిగే సమయంలో, ఆమె ఇంటి-నుండి తయారయి వచ్చిన ఆహారాన్ని మాత్రమే తినేవారు, అంటురోగాల బారిన పడే అవకాశాలను తగ్గించడానికి ఒక బావి నీటిని మాత్రమే వాడేవారు. కానీ ఆమె పరిస్థితి పూర్తిగా వికటించి, 1969లో 36 సంవత్సరాల వయసులో చనిపోయారు. జబ్బుతో ఉన్నప్పటికీ, 1950లలోని ఎక్కువ చిత్రాలలో మధుబాల విజయవంతంగా నటించారు.
ఆమె హాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించారు. థియేటర్ ఆర్ట్స్ వంటి అనేక అమెరికన్ పత్రికలలో ఆమె కనిపించారు. వారి ఆగస్టు 1952 సంచికలో, ఒక విస్తృతమైన వ్యాసంతో పాటు మధుభాల పూర్తి పేజీ ఫోటోలో చూపబడ్డారు. ఈ వ్యాసం పేరు: ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ది వరల్డ్ (అండ్ షి’స్ నాట్ ఇన్ బెవెర్లీ హిల్స్). అయితే, ఆమె తండ్రి అయిష్టత కారణంగా ఆమె హాలీవుడ్ కు వెళ్ళలేకపోయారు.
ఒక నటిగా, మధుబాల పరిశ్రమలో ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. ఆమె సహనటులు ఆకాలంలో అత్యంత ప్రసిద్ధి చెందినవారు: అశోక్ కుమార్, రాజ్ కపూర్, రెహ్మాన్, ప్రదీప్ కుమార్, షమ్మీ కపూర్, దిలీప్ కుమార్, సునీల్ దత్ మరియు దేవ్ ఆనంద్. మధుబాల ఆ కాలంలోని అనేక ప్రసిద్ధ ప్రధాన నటీమణుల సరసన కూడా నటించారు, వీరిలో కామినీ కౌశల్, సురయ్య, గీతా బాలి, నళిని జయవంత్ మరియు నిమ్మి వున్నారు.


మధుబాల, తన సహ నటుడు అయిన దిలీప్ కుమార్‌తో దీర్ఘకాలం ప్రేమ సంబంధాన్ని కలిగిఉన్నారు. తెరమీద కూడా వారు ఒక ప్రసిద్ధ ప్రేమజంటగా మారి మొత్తం నాలుగు చిత్రాలలో నటించారు. బి.ఆర్.చోప్రాకు సంబంధించిన ఒక కోర్టు కేసులో ఇరువురికి వివాదం వలన వారు విడిపోవలసి వచ్చింది.
ఆమె, తన భర్త, నటుడు మరియు నేపథ్యగాయకుడు అయిన కిషోర్ కుమార్‌ను చల్తీ కా నామ్ గాడీ (1958) మరియు ఝుమ్రూ (1961)ల చిత్రీకరణ సమయంలో కలుసుకున్నారు. అప్పటికీ ఆయనకు బెంగాలీ గాయని మరియు నటి రుమా గుహా టాకుర్తాతో వివాహమైంది. ఆయన విడాకులు తీసుకున్న తరువాత, కిషోర్ కుమార్ హిందూ మరియు మధుబాల ముస్లిం కావడంతో, 1960లో వారు పౌరవివాహం చేసుకున్నారు.
2008లో మధుబాల జ్ఞాపకార్ధం ఒక తపాలా బిళ్ళ విడుదల చేయబడింది.  నేడు  మధుబాల  వర్ధంతి. ఈ సందర్భంగా వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా మధుబాల
కి   నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్. 

Leave a comment

error: Content is protected !!