చిత్రం: కపటధారి

న‌టీన‌టులు: సుమంత్‌ అక్కినేని, నందిత‌ శ్వేత, సుమ‌న్ రంగ‌నాథ‌న్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

సంగీతం‌: సైమ‌న్ కె.కింగ్‌

పోరాటాలు‌: స్టం ట్ సిల్వ

క‌ళ‌: విదేశ్‌

క‌థ‌: హేమంత్ ఎం.రావు

కూర్పు: ప్ర‌వీణ్ కె.ఎల్‌

మాట‌లు: బాషా శ్రీ

 నిర్మాత‌: ల‌లిత ధ‌నుంజ‌య‌న్‌

ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి

సంస్థ‌: క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌

విడుద‌ల‌: 19-02-202

తెలుగులోకి త‌మిళం, మ‌ల‌యాళ భాషల నుంచే కాదు కొన్నిసార్లు క‌న్న‌డ భాష సినిమా క‌థ‌లు కూడా రీమేక్ అవుతుంటాయి. అలా వచ్చిన సినిమానే సుమంత్ ‘క‌ప‌ట‌ధారి’. ఇది ‘కావలుధారి’గా అనే పేరుతో కన్నడంలో తెరకెక్కి విజ‌యాన్ని అందుకున్న థ్రిల్ల‌ర్ కథా చిత్రం. చాలా కాలం గ్యాప్ తీసుకుని తనకున్న మంచి ఫ్యామిలి ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని మళ్ళీ రావా..! వంటి లవ్ స్టొరీ తో ఫాం లోకి వచ్చిన సుమంత్ కాస్త విభిన్నంగా ట్రాఫిక్ పోలీసు ఆఫిసర్ పాత్రలో చేసిన థ్రిల్ల‌ర్ సినిమా ఇది. సినిమా అంతా ఓ కేస్ ను చేధించే దిశగా వచ్చే మలుపులతో సాగుతుంది.

క‌థ:

గౌత‌మ్ (సుమంత్) ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అత‌నికి క్రైమ్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాల‌నే కోరిక, కానీ, తనపై అధికారి అందుకు అంగీకరించడు. అలా అయిష్టంగానే తన డ్యూ టి చేస్తూఉంటాడు. ఐతే తాను పనిచేస్తున ప‌రిధిలోనే ఓ కుటుంబానికి చెందిన అస్తిపంజరాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అవి నల‌భై యేళ్ల కింద‌ట జ‌రిగిన హ‌త్య‌ల‌ని తెలుస్తుంది.. క్రైమ్ విభాగానికి చెందిన పోలీసులు ఆ కేసుని మూసివేసే ఆలోచ‌న‌లో ఉండ‌గా, గౌత‌మ్ ఆ హ‌త్య‌ ల వెనకున్న నిజాల్ని బయటపెట్టే దిశగా తానే స్వ‌యంగా ప‌రిశోధ‌న మొద‌లు చేయడం పెడ‌తాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇంత‌కీ న‌ల‌భ‌య్యేళ్ల కింద‌ట ఆ హ‌త్య‌ల్ని ఎవ‌రు చేశారు? గౌత‌మ్ హంత‌కుల్ని ప‌ట్టుకున్నాడా? క్రైమ్ విభాగంలోకి వెళ్లాల‌న్న ఆయ‌న కోరిక తీరిందా? అనే విషయాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సి.

కథ విశ్లేషణ:

ఒక హ‌త్య జ‌రుగుతుంది కాని దాని వెనుక ఎవ‌రన్న‌ది ఎవరు చేశారుఅనేది మాత్రం అంతుచిక్క‌దు. చిన్నపాటి క్లూ కూడా దొర‌క‌దు. తనకు కలిగిన ఒక చిన్న ఆలోచనతో ప్రయత్నిస్తూ ఆ తీగని ప‌ట్టుకుని లాగుదాం అనుకునేలోపే అనుకోని అవాంత‌రాలు, ఊహించ‌ని విధంగా కొత్త కొత్త విషయాలు బ‌య‌టపడుతూ కేస్ మ‌రింత క్లిష్ట‌త‌రంగా తయారవుతుంది. తర్వాత ఏమి జరుగుతుంది అనే ఉత్కంట మొద‌ల‌వుతుంది. దాదాపుగా క్రైమ్ థ్రిల్ల‌ర్ కథలు అన్ని కూడా ఈ శైలిలోనే తెరక్కెక్కుతాయి. ఈ క‌థ కూడా ఆ కోవకు చెందిన క్రైమ్ థ్రిల్లర్ కథే కానీ, ఇందులో జరిగిన హ‌త్య‌లు అప్పుడెప్పుడో న‌ల‌భ‌య్యేళ్ల కింద‌ట జ‌రిగినవి. ఆధారాలతో పాటు, చుట్టూ ఉన్న మ‌నుషులు మరియు అక్కడి ప‌రిస్థితులు అన్ని మారిపోయింటాయి.. అలాంటి ఓ క్లిష్ట‌మైన కేస్‌ని సవాల్ గా తీసుకుని కేస్ను చేధించే తన ప్రయత్నంలో త‌నకి ప్రతిచోట ఎదురువచ్చే స‌వాళ్ళు వాటిని చేధించడమే ఈ సినిమాలో కీల‌కమైన అంశం. ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ ఈ క్రైమ్ కేసుని ఛేదించ‌డం అనేది ఇంట్రెస్టింగ్ విష‌య‌మే. అందుకే క‌థానాయ‌కుడు క్రైమ్ సీన్‌లోకి అడుగుపెట్ట‌గానే కేసుని ఎక్క‌డ నుండి మొద‌లు పెడ‌తాడ‌నే అంశం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని కలిగిస్తుంది. గౌతమ్ కేసును స్టడి చేసే భాగంగా లాక‌ప్ న్యూస్ జ‌ర్న‌లిస్ట్ జీకే (జ‌య‌ప్ర‌కాష్‌)తో క‌లిసి ప‌రిశోధించ‌డం మొద‌లు పెడ‌తాడు. ఆ త‌ర్వాత ఈ కేసును కొన్ని ద‌శాబ్దాల కిందట డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ రంజిత్ (నాజ‌ర్‌) కనిపిస్తాడు.. రంజిత్ రాక‌తోనే క‌థలో వేగంగా సాగుతుంది. గౌత‌మ్ సేక‌రించిన ఆధారాలు కొన్ని మరియు అప్ప‌ట్లో రంజిత్ ఇన్వెస్టిగేషణ్ లో బయటికి వచ్చిన విష‌యాలను క‌లిపి కేస్‌ని ప‌లు దిశలుగా ప‌రిశోధించ‌డం మొద‌లుపెడ‌తాడు. అస‌లు ర‌హ‌స్యం క‌థానాయిక ర‌మ్య ద్వారా బ‌య‌టప‌డుతుంద‌నేలోపే మ‌రో మ‌లుపు. ఇలా చివ‌రి వ‌ర‌కూ క‌థ‌లో మ‌లుపులే. ‘కావ‌లుధారి’ క‌థ‌లో ఎలాంటి మార్పులు చేయ‌కుండా తెలుగులో తీశారు కానీ… అక్క‌డి స్థాయిలో భావోద్వేగాలు మాత్రం పండ‌లేదు. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సినిమాలో కొన్ని స‌న్నివేశాలు మాత్ర‌మే థ్రిల్‌ని పంచుతాయి. క్రైమ్ థ్రిల్‌ ర్ క‌థ‌ల్లో క‌నిపించే వేగం ఇందులో తగ్గింది. క్లైమాక్స్ వచ్చే స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. క‌థ‌నంలో పట్టు లోపించింది. చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

సుమంత్ తనకు సరిపోయే పాత్రను సినిమాను ఎంచుకున్నాడు ,లుక్ పరంగా బాగున్నాడు. నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ అనుభ‌వం ఈ సినిమాకి ప‌నికొచ్చింది. పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. క‌థానాయిక చేసిన నందిత శ్వేతది నామమాత్రమైన పాత్ర‌నే తనకి నటన పరంగా ప్రాధాన్యం లేదు. వెన్నెల కిషోర్ ప్ర‌థ‌మార్ధంలో కొన్ని చోట్ల న‌వ్వించారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. విలన్ పాత్రలో నటించిన కన్నడ నటుడు సంపత్ కూడా ఆకట్టుకున్నాడు టెక్నీషియన్స్ పనితనం: ఒక బ్యాగ్రౌండ్ సాంగ్ మినహాయిస్తే కపటధారిలో పాటలేమీ లేవు. ఆ పాటతో పాటు నేపథ్య సంగీతంతో సైమన్ కింగ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఈ థ్రిల్లర్ మూవీకి అవసరమైన మేర నిర్మాణ విలువలు పాటించారు నిర్మాత ధనంజయన్. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి మాతృకను యాజిటీజ్ ఫాలో అయిపోయాడు తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. చాలా వరకు ఒరిజినల్ ను ఫాలో అయినప్పటికీ.. దాంతో పోలిస్తే తెలుగు వెర్షన్లో గ్రిప్ తగ్గిపోవడం దర్శకుడి వైఫల్యమే. ప్రదీప్ కథను చెప్పే విధానంలో ఇంకాస్త వేగం చూపించి ఉండాల్సిందనిపిస్తుంది.

చివరగా: కథలో మలుపులు ఎక్కువు ద్రిల్లింగ్ ఎలిమెంట్స్ తక్కువా

రేటింగ్- 2.25/5

Leave a comment

error: Content is protected !!