వేటూరి 85వ జయంతి సందర్భంగా ఆయన సినీ స్మృతులు (జ్ఞాపకాలు)

“వేటూరి సుందరరామమూర్తి”   ఆ పేరులోనే దాగి ఉంది మధురమైన సాహిత్యం. “సుందరమైన రాముని వంటి రూపం” అని ఆ పేరుకు అర్థం. అలా పేరుకు తగట్లే ఆయన రూపం నడవడిక రాసే పాటలలోని సాహిత్యం ప్రతి పక్తులోని పదం అక్షరం కూడా అంతే సుందరం సుమాధుర్యం. ఎవరైనా ఒక సినీకవి ఒక శైలి పాటలు రాయడానికి సుప్రసిద్ధులు అయ్యుంటారు కానీ వేటూరి  వచ్చాక పలువురు సినీకవులు తమ కలం పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అయన కలానికి రెండు వైపులా పదునే భక్తి రక్తి శృంగార సామాజిక చైత్యన పరిచే మాస్ క్లాస్ అంటు ఆయన రాయని శైలి లేదు.  

బాల్యం – చదువు:

కృష్ణా జిల్లా పెద్దకళ్ళేపల్లిలో చంద్రశేఖర శాస్త్రి & కమలాంబ దంపతులకు 1936 జనవరి 29 న జన్మించారు. ఆయన తాతగారు కూడా కవినే. ప్రముఖ కవి, పరిశోధకులు వేటూరి ప్రభాకర శాస్త్రికి వేటూరి  మేనల్లుడు అవుతారు. మద్రాస్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, విజయవాడ ఎస్.ఆర్.ఆర్ & సి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాలలో బి. ఏ చదివారు.

సినీరంగ ప్రవేశం:

ముందు నటుడు అవ్వాలనే ఆలోచనతో మద్రాస్ వెళ్లిన ఆయన రచన వైపు దృష్టినిసారించి, జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి ఆంధ్రప్రభలో ఉపసంపాదికుడు గా చేరి 16 ఏళ్లు జర్నలిజంలో ఉన్నారు. ఆంధ్రప్రభ, వార్తాపత్రికలకు ఎడిటర్ గా చేశారు. 1969 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి “సిరికాకుళం చిన్నది” అనే సంగీతరూపకం వేటూరి రచనగా ప్రసారమై ఎందరినో ఆకట్టుకుంది. సినీరంగంలో పాటల కవిగా పాదం మోపేందుకు ఒకరకంగా “పాస్పోర్ట్” అయ్యింది అది ఆయనకు.అప్పటి అగ్రనటులు ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో “దీక్ష” సినిమా కోసం “నిన్నరాతిరి కలలో” అనే పాట రాసిన అది రికార్డ్ అవ్వలేదు. తర్వాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “ఓ సీత కథ”లో “భారత నారీ చరితము మధుర కథా భరితము” అనే పాట తొలి పాటగా రికార్డ్ అయ్యింది. అలా మొదలైన ఆయన కలం అల్లు అర్జున్ గుణశేఖర్ కలయిక లో వచ్చిన వరుడు వరకు సాగింది.

రాసిన పాటలు & పేరు తెచ్చిన పాటలు:

సిరిసిరమువ్వ, భక్త కన్నప్ప, సప్తపది, శంకరాభరణం, శ్రీవారికి ప్రేమలేఖ, ముద్ద మందారం, నాలుగు స్తంభాలాట, పంతులమ్మ, శుభోదయం, శుభలేఖ, మల్లె పందిరి, రెండు జ సీత, అమరజీవి, ఆనంద భైరవి, శ్రీవారి శోభనం, మొగుడు పెళ్ళాలు, చంటబ్బాయ్, అన్వేషణ, ఆలాపన, మయూరి, అమావాస్య చంద్రుడు, జానకి రాముడు, పదహారేళ్ళ వయసు, రంగూన్ రౌడీ, అడవిరాముడు, మేఘ సందేశం, కొండవీటి సింహం, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఖైదీ, ఆదిత్య 369, ప్రేమించు పెళ్లాడు, సితార, సీతాకోకచిలుక, గీతాంజలి, ఆఖరి పోరాటం, బావ బావమరిది, మరణ మృదంగం, రాక్షసుడు, చంటి, మాతృదేవోభవ, చూడాలని ఉంది..! ప్రతిఘటన, గంగోత్రి, ఆనంద్, హ్యపీ డేస్, గోదావరి, అర్జున, లీడర్ & వరుడు…..ఇలా చెప్పాలి అంటే ఎన్నో సినిమాలు.  చివరి సినిమా వరుడు వరకు 5000 పైచిలుకు పాటలు రాశారు.

రాసిన పాటలు & పేరు తెచ్చిన పాటలు:

1970సం”లో

* ఓ సీత కథ  (1974) (భారతనారీ చరితము హరికథ)

* కృష్ణవేణి (1974)

* పంతులమ్మ (1977) ( మానస వీణ మధు గీతం)

* సిరి సిరి మువ్వ (1978)

* గోరింటాకు (1979) (కొమ్మ కొమ్మకో సన్నాయి)

* శంకరాభరణం (1979) (శంకరా నాదశారీరాపర)

1980సం”లో

* మంచు పల్లకి (1982) (మేఘమా దేహమా, మనిషే మనిదీపం)

* శుభలేఖ (1982) (రాగాల పల్లకిలో కోకిలమ్మ రాలేదు ఈ వేళా ఎందుకమ్మ?)

* ఖైదీ (1983) (గోరింట పూసింది, మెర మెర మెరుపుల మేనక, రగులుతోంది మొగలి పొద)

* మంత్రి గారి వియ్యంకుడు (1983) (ఏమనిలే చెలి పాడేదనో)

* మేఘ సందేశం (1983) (నిన్నటి దాక శిలననైన)

* రుస్తుం (1984)

* అన్వేషణ (1985) (ఎదలో లయ, కీరవాణి, ఏకాంత వేళ, ఇళలో.కలిసే)

* చంటబ్బాయ్ (1986)

* పడమటి సంధ్యా రాగం (1986)

* ప్రతిఘటన (1986) (ఈ దురోధనదుశ్శాసన)

* ఆఖరి పోరాటం (1988) (తెల్ల చీరకు)

* మరణ మృదంగం (1988)

* గీతాంజలి (1989)

1990సం”లో

* జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)

* చంటి (1991) (పావురానికి పంజరానికి)

* గ్యాంగ్ లీడర్ (1991)

* నిర్ణయం (1991) (మిల మిల మెరిసిన తార)

* ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

* రోజా (1992)

* సుందరకాండ (1992) (lyrics: “ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే)

* గోవిందా గోవిందా (1993) (ఓ నవీన)

* మాతృదేవోభవ (1993) (రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే)

* మెకానిక్ అల్లుడు (1993)

* సూపర్ పోలీస్ (1994)

* రాముడొచ్చాడు (1996)

* రావోయి చందమామ (1999)

2000సం”లో

* అన్నయ్య (2000) (హిమసీమల్లో, గుస గుసలే, వాన వల్లప్ప, )

* బావ నచ్చాడు (2001)

* మృగరాజు (2001) (శతమానంఅన్నదిలే)

* ఇంద్ర (2002) (అమ్మడు పచ్చి)

* ఠాగూర్ (2003) (మన్మథ మన్మథ)

* ఆనంద్ (2004) (వచ్చె వచ్చె, యమునా తీరం, నువ్వేనా, యమునా తీరం, చారుమతి , ఐ లవ్ యూ, తెలిసి తెలిసి, యదలో గానం”)

* అర్జున్ (2004)

* ఆర్య (2004)

* ఛత్రపతి (2005)

* గోదావరి (2006) (ఉల్పొంగెలే గోదావరి)

* సైనికుడు (2006)

* మధుమాసం (2007)

* దశావతారం (2008)

* కంత్రి (2008) (వయస్సునామి)

* సుందరకాండ (2008)

* బెండు అప్పారావు R.M.P (2009)

* వరుడు (2010)

* ‘మణిరత్నం’ విలన్ (2010) (తమిళ్ డబ్ ఆఫ్ రావణ్

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ & అల్లు అర్జున్ వరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు ఇచ్చారు

అవార్డ్స్:

23వ సమావేశం ఆచార్య నాగార్జున యూనిర్సిటి నుండి డాక్టరేట్

జంధ్యాల మెమోరియల్ అవార్డ్

మాతృదేవోభవ – రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు జాతీయ స్థాయి పురస్కారం

2006 లో తెలుగు భాషను స్థాయిని శాస్త్రీయ భాషగా పరిగణించకపోతే తాను పొందిన జాతీయ స్థాయి పురస్కారం ను వెనుతిరిగి ఇచ్చేస్తాను అని చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత తెలుగు భాషకు శాస్త్రీయ భాష గా పరిగణించింది.

గోదావరి – ఉప్పెంగెలే గోదావరి కి ఫిలింఫేర్ అవార్డు

2008 లో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్

రాష్ట్ర ప్రభుత్వము నుండి 7 నంది అవార్డులు అందుకున్నారు

నంది అవార్డ్ సినిమా పాటలు

మానసవీణ మధుగీతం – పంతులమ్మ

శంకరా నాదశరీరాపరా – శంకరాభరణం

బృందావని ఉంది – కాంచన గంగ

ఈ దుర్యోధనదుశ్శాసన – ప్రతిఘటన

పావురానికి పంజరానికి – చంటి

ఆకాశాన సర్యుడుండడు – సుందరాకాండ

ఉప్పెంగెలో గోదావరి – గోదావరి

మనస్విని అవార్డ్స్

వేణువై వచ్చాను – మాతృదేవోభవ

ఆకాశాన సూర్యుడుండడు – సుందరాకాండ

తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి, ఆసక్తి, ఉండి, తాము తనలా పాటలు రాయాలని అనే ఎందరో సినీపాటల రచయితలకు ఒక నిఘంటువు. నేడు వేటూరి జయంతి . ఈ సందర్భంగా ఆ  సరస్వతీ పుత్రుడికి  అక్షర నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.  ‘

Leave a comment

error: Content is protected !!