విలక్షణ నటుడు చలం నటించిన కుటుంబ కథాచిత్రం ‘సంబరాల రాంబాబు’. 1970లో విడుదలైన ఈసినిమా తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. జీ.వి.ఆర్ .శేషగిరి రావు దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమాను టి.మోహన్ రావు నిర్మించారు. శారద కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. యస్వీఆర్, గుమ్మడి, చంద్రమోహన్, రేలంగి, పద్మనాభం, సూర్యకాంతం, గీతాంజలి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. వి.కుమార్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా మామా చందమామ, విన్నారా విన్నారా పాటలు వీనుల విందు చేస్తాయి.

అనాథ అయిన రాంబాబు .. కొన్ని ఇళ్ళ సముదాయం లో పనిచేస్తూ.. వారు పెట్టింది తింటూ.. ఓ మూల తన నివాసం ఏర్పరుచుకుంటాడు. అతడి అమాయకత్వానికి లక్ష్మి అతడ్ని ప్రేమిస్తుంది. అందులో లక్ష్మి తండ్రి అతడ్ని రాంబాబును ఎంతగానో అభిమానిస్తాడు. అలాగే.. నాయర్ రాంబాబు మీద ఈగకూడా వాలకుండా చూసుకుంటాడు. అందరి ఆదరాభిమానాలకు మురిసిపోయిన రాంబాబు మీద దొంగ తనం కేసు మోపి.. అతడ్ని ఆ ఇంటినుంచి వెళ్లగొట్టాలని చూస్తారు. అయితే అతడ్ని నిజాయితీని నిరూపించి అతడికి లక్ష్మికిచ్చి పెళ్ళిచేస్తారు. నిజానికి ఈ సినమా కె.బాలచందర్ తమిళ్ లో తీసిన ‘ఎదిర్ నీచల్’ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ వెర్షన్ . తమిళంలో చలం పాత్రను నాగేశ్ పోషించి మెప్పించారు.

Leave a comment

error: Content is protected !!