అక్కినేని నాగేశ్వరరావు నటించిన అత్యుత్తమ చిత్రాల్లో ‘మరపురాని మనిషి’ ఒకటి. 1973 లో విడుదలైన ఈ సినిమాని  శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎన్ఎన్ భట్ నిర్మించారు. తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికిగాను అక్కినేని నాగేశ్వరరావు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు  అవార్డును గెలుచుకున్నారు. మంజుల కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. యస్వీఆర్, గుమ్మడి, జగ్గయ్య, రాజబాబు, నాగభూషణం, చంద్రమోహన్, మాడా, జయంతి, రోజారమణి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

అబ్బి (అక్కినేని నాగేశ్వరరావు) ఓ అనాథ, ఆత్మగౌరవం గల వ్యక్తి. రిక్షావాడి‌గా పనిచేస్తూ తనకాళ్ళపై తాను నిలబడి జీవిస్తూంటాడు. అతను ఒక కాలనీలో నివసిస్తున్నాడు. అక్కడ ప్రతి ఒక్కరూ అతని స్నేహపూర్వక స్వభావం వలన అతనంటే ఆదరంగా ఉంటారు. ఒక హోటల్ యజమాని రంగయ్య (ఎస్.వి.రంగ రావు) అతన్ని తన కొడుకుగా చూస్తాడు. కాని అతను ఎప్పుడూ అతని సహాయం కోరడు. అబ్బి ఒక అందమైన అమ్మాయి లక్ష్మి (మంజుల) తో ప్రేమలో పడతాడు. ఒక రాత్రి, అతను భారీ వర్షలో ధనవంతుడు శంకర్ (జగ్గయ్య) కుటుంబానికి సహాయం చేస్తాడు. దానికి బదులుగా, అతను తన భార్య పార్వతి (జయంతి), వారి అందమైన చిన్న కుమార్తె అమ్ములు (బేబీ శ్రీదేవి) తో సహా అందరూ అతడికి తమ ఇంట్లో మంచి ఆతిథ్యం ఇస్తారు.. అక్కడ నుండి, అమ్ములు తన రిక్షాలో స్కూల్ కి  తీసుకు వెళ్తూంటాడు. శంకర్ జీవితాశయం అమ్ములును గ్రాడ్యుయేట్ గా చూడటమేనని అతడికి తెలుస్తుంది. ఇంతలో, లక్ష్మిని ఒక గూండా రంగా (ఆనంద మోహన్) మానభంగం చేసి చంపేస్తాడు. ఆ కోపంలో, అబ్బి అతన్ని చంపి, జైలుకు వెళ్తాడు. విడుదలైన తరువాత, అమ్ములును బిచ్చగత్తెగా, పార్వతిని వితంతువుగానూ చూసి షాక్ అవుతాడు. రంగయ్య అతనికి ఒక రిక్షా ఇప్పిస్తాడు. శంకర్ దివాళా తీసి చనిపోయాడని అతడు తెలుసుకుంటాడు. ఇప్పుడు అబ్బి వారి సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. నిజానికి ఈ సినిమా ‘ఓడయిల్ నిన్ను’ అనే మలయాళ సినిమాకి రీమేక్ వెర్షన్. సత్యన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆయనికి నేషనల్ అవార్డు ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఇదే సినిమా తమిళంలో, హిందీలోనూ ‘బాబు’ పేరుతో రీమేక్ అయింది.  

Leave a comment

error: Content is protected !!