విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాల్లో కొన్ని అత్యధిక ప్రజాదరణ పొందాయి. అలాంటి వాటిలో ‘రౌడీగారి పెళ్ళాం’ సినిమా చాలా ప్రత్యేకమైనది. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మాణంలో .. కె.యస్ . ప్రకాష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. 1991 లో విడుదలైన ఈ సినిమాలో మలయాళ సుందరి శోభన కథానాయికగా నటించి మెప్పించింది. ఇందులో ఇంకా నర్రా వెంకటేశ్వరరావు , కోట శ్రీనివాసరావు, ప్రసాద్ బాబు, అన్నపూర్ణ, బ్రహ్మానందం, రజిత ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. బప్పీ లహరి సంగీత సారధ్యంలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా బోయవాని వేటుకు గాయపడిన కోయిల అనే జేసుదాసు పాడిన పాట ఇప్పటికీ మారుమోగుతునే ఉంటుంది.

మోహన్ బాబు స్థానిక అవినీతి రాజకీయ నాయకుడికిఅనుచరుడిగా ఉంటూ చిన్నచిన్న నేరాలు చేసే వీధి రౌడీ. ఒకమ్మాయి పట్ల  విచక్షణా రహితంగా వ్యవహరించి.. ఆమెకు జీవితం లేకుండా చేద్దామని అనుకుంటాడు.  అయితే  అనుకోకుండా ఆమెనే పెళ్ళి చేసుకొని .. మంచి మనిషిగా ఎలా మారాడు అనేది సినిమా కథ. నిజానికి ఈ సినిమా పుదియపాదై అనే తమిళ సినిమాకి రీమేక్ వెర్షన్. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయింది.  ఈ సినిమాతోనే తమిళ చిత్రాల్లో సీత కథానాయికగా రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా దర్శకుడు, హీరో అయిన పార్తీబన్ తో ఆమె ప్రేమలో పడి.. పెళ్ళి కూడా చేసుకుంది. అయితే ఇదే తమిళ సినిమా అప్పట్లోనే తెలుగులో ‘యముడే నా మొగుడు’ గా డబ్బింగ్ అయి..అది కూడా సూపర్ హిట్టయింది.

 

Leave a comment

error: Content is protected !!