టాలీవుడ్ లో  ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు రంగనాథ్. ఆయన నటించిన అద్భుత చిత్రాల్లో ‘రామచిలక’ ఒకటి. సుందర్ లాల్ నహతా సమర్ఫణలో విజయలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై .. శ్రీకాంత్ నహతా నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళాభినేత్రి వాణీశ్రీ కథానాయికగా నటించింది. ఇంకా.. చంద్రమోహన్ , రావికొండలరావు, రావుగోపాలరావు, కాంతారావు, సాక్షిరంగారావు, ఫటాఫట్ జయలక్ష్మీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

పల్లెటూరి పిల్ల అయిన వాణీశ్రీ ఆ ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ రంగనాథ్  ను ప్రేమిస్తుంది.  అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రంగనాథ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ ఊళ్ళో ఒకడి కన్ను వాణీశ్రీ మీద పడుతుంది. ఆమె తిరస్కరించడంతో .. ఆ ఊరి ప్రజల్లో ఆమె పరువు తీసే ప్రయత్నం చేస్తాడు. చివరికి వాణీశ్రీ తన అమాయకత్వాన్ని ఎలా ప్రూవ్ చేసుకొని తిరిగి ఆ ఊళ్లో తన గౌరవాన్ని నిలబెట్టుకుంటుందనేదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా తమిళ సూపర్ హిట్టు మూవీ అణ్ణక్కిళికి రీమేక్ వెర్షన్ . సుజాత , శివకుమార్ జంటగా నటించిన ఈ సినిమా తోనే మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలాగే… రామచిలకలోని పాటలు కూడా సంగీత ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాయి. సత్యం అందించిన సంగీతం ఈ సినిమాకే హైలైట్ గా నిలిచిపోయింది.

 

Leave a comment

error: Content is protected !!