అక్కినేని నాగార్జున , అమల గారాల పుత్రుడు అఖిల్ .. పాకే ప్రాయంలోనే తెరమీద అభినయించి  .. అల్లరి చేసిన  వినోదాత్మక సినిమా ‘సిసింద్రీ’. 1995, సెప్టెంబర్ 14న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది.  గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు శివనాగేశ్వరరావు. ఆమని, శరత్ బాబు, సుధాకర్, తనికెళ్ళ భరణి, గిరిబాబు, శివాజీరాజా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

కోటీశ్వరుడైన శరత్ కుమార్ దంపతుల గారాల తనయుడు నెలల ప్రాయంలో ఉండగానే  కిడ్నాప్ కు గురి అవుతాడు. ఆ బాబును జక్కన్న, అక్కన్న, మాదన్న అనే ముగ్గురు ఎత్తుకు పోతారు. అయితే ఆ పిల్లోడు సిసింద్రీగా మారి.. వారిని ముప్పు తిప్పలు పెడతాడు. ఉంచిన ప్లేస్ లో ఉండకుండా..  నగరంలోని రకరకాల ప్రాంతాలకు తనకు తెలియకుండానే ట్రెవెల్ అవుతుంటాడు. మొత్తానికి ఆ బుడతడు నాగార్జున చేతుల్లో పడతాడు. చివరికి ఆ చిన్నారి తిరిగి తన తల్లిదండ్రుల్ని ఎలా చేరాడు? అన్నదే మిగతా కథ.

హాలీవుడ్ మూవీ‘ బేబీస్ డే అవుట్’ సినిమాకి ఫ్రీమేక్ వెర్షన్ సిసింద్రీ. ఆ సినిమాలోని సన్నివేశాల్ని, కామెడీ ని యాజిటీజ్ గా వాడుకున్నారు. ఇందులో  పసిపిల్లవాడుగా ఉన్న అఖిల్ మూడ్ ను బట్టి.. అతడి మీద సన్నివేశాలు చిత్రీకరించేవారు. అలాగే… అతడి తల్లి అమల సమక్షంలోనూ, సంరక్షణలోనూ షూటింగ్ జరిగేదట. రాజ్ సంగీతం అందించిన  ఈ సినిమాలోని పాటలు జనాదరణ పొందాయి. ముఖ్యంగా చిన్నితండ్రి, ఆటాడుకుందాం రా అనే పాటలు  ఇప్పటికీ ఎంతో  ఆకట్టుకుంటాయి.

Leave a comment

error: Content is protected !!