రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లో మరుపురాని మరిచిపోలేని సినిమా ‘అమరదీపం’. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణం రాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు కె.రాఘవేంద్రారావు. జయసుధ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. మురళీమోహన్, సత్యనారాయణ, మాధవి, ప్రభాకరరెడ్డి, జయమాలిని, సారథి, సాక్షి రంగారావు, రమాప్రభ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 1977లో విడుదలైన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. అంతేకాదు ఈ సినిమాతో కృష్ణం రాజుకు ఉత్తమ నటుడి అవార్డు లభించింది.

హరి చిన్నప్పుడు తన తమ్ముడు శివప్రసాద్ తలకు గాయం చేసి ఇంట్లోంచి పారిపోతాడు. ఒక స్మగ్లర్ అతడ్ని చేరదీసి .. పేరు మార్చి తనంతటవాడిని చేస్తాడు. అతడి సంపద, హోదా పెరుగుతుంది. అయితే అతడొక అమ్మాయిని ప్రేమిస్తాడు . కానీ ఆ అమ్మాయి శివప్రసాద్ ను ఇష్టపడుతుంది. దాంతో హరి శివప్రసాద్ ను చంపుదామనుకొనే టైమ్ లో అతడు తన తమ్మడని అర్ధమవుతుంది. దాంతో మనసు మార్చుకున్న హరి తన తమ్ముడితో అతడు ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి తాను ప్రాణ త్యాగం చేస్తాడు. సత్యం సంగీతం అందించిన ఈసినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్టయ్యాయి. నిజానికి ఈ సినిమా మలయాళ సూపర్ హిట్టు చిత్రం తీక్కనల్ కు రీమేక్ వెర్షన్ . ఇదే సినిమా ఆ తర్వాత తమిళంలో శివాజీ గణేశన్ తో దీపంగా రీమేక్ అయింది.

Leave a comment

error: Content is protected !!