కృష్ణ , శోభన్ బాబు నటించిన మల్టీస్టారర్ మూవీస్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో .. అద్భుతమైన కథాకథనాలతో తెరకెక్కిన సినిమా ‘గంగ మంగ’. వాణీ శ్రీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాను విజయా వారి సంస్థలో నిర్మించారు. తాపీ చాణక్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగువారిని భలేగా అలరించింది. నిజానికి ఈ సినిమా యన్టీఆర్ ‘రాముడు భీముడు’ సినిమాకి ఫిమేల్ వెర్షన్ లా ఉంటుంది. కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా నటించగా… రేలంగి, సూర్యకాంతం, చంద్రమోహన్ , వై.విజయ, పద్మనాభం, రమాప్రభ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

గంగ ధనికురాలు.. అమాయకురాలు, మంగ పేదవారింట్లో పెరిగినా.. అసాధ్యురాలు. ఇద్దరూ అక్కచెల్లెలు అన్న సంగతి తెలుసుకున్న ఇద్దరూ ఒకరి స్థానాలు ఒకరు మారిపోయి.. సమస్యల్ని చక్కదిద్దడమే మిగతా కథ. గంగ మంగగా వాణిశ్రీ అదరగొట్టింది. నిజానికి  ఈ సినిమా సీతా ఔర్ గీతా బాలీవుడ్ సినిమాకి రీమేక్ వెర్షన్. హేమామాలిని ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా బాలీవుడ్ లో ఘన విజయం సాధించింది. రమేశ్ సిప్పీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోగా ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ హీరోలుగా నటించారు.

Leave a comment

error: Content is protected !!