తెలుగు సినిమారంగంలో మూకీల యుగం ప్రారంభమైన కొత్తల్లోనే ప్రవేశించి..దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు తెలుగువారిని తన హాస్యంతో చెక్కిలిగింతలు పెట్టించిన కమెడియన్  కస్తూరి శివరాం. ఆయన గురించి ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. తొలి తరం సినిమాల్లో  ఆయన ఒక ఉప్పెన. ఒక ప్రభంజనం. అప్పట్లో హాస్యానికి ఆయనే కింగ్. సినిమాల్లో వేషాలు వేయడానికి ముందు ..టూరింగ్ టాకీసుల్లో మూకీ చిత్రాలకు నేపథ్య వ్యాఖ్యానం అందించేవారు. 1939లో విడుదలైన వరవిక్రయం ఆయన తొలి సినిమా. ఆ తర్వాత నటించిన సినిమాలతో హీరోల కన్నా ఎక్కువగా వెలుగు వెలిగిన వారు. ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మూడు నాలుగు కార్లు వాడేవారు. అందులో ఒకటి బ్యూక్ కారు. అప్పట్లో మద్రాస్ లో చాలా తక్కువ మందిదగ్గర ఆ కార్ ఉండేది. తారా పథం నుంచి రాలి పడిపోయాకా చివరి దశలో పాండీ బజార్ లో డొక్కు సైకిల్ మీద తిరిగేవారు ఆయన. ఆయన చనిపోయినప్పుడు అద్దెకారు డిక్కీలో తరలించారు ఆయన్ను. తెలుగు సినీరంగంలోని ఉచ్ఛనీచాల్ని చవిచూసిన ఆయన తెలుగు హాస్యనటుల చరిత్రలో చిరంజీవిగా నిలిచిపోయారు.

 

Leave a comment

error: Content is protected !!