విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘గురు’. సుధకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 31, 2017 లో విడుదలై ఘనవిజయం సాధించింది . వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై శశికాంత్ నిర్మించిన ఈ సినిమాలో వెంకీ సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో అభిమానుల్ని అలరించారు. రితికా సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా… నాజర్, తణికెళ్ళ భరణి, జాకీర్ హుస్సేన్, రఘుబాబు, అనంత్ బాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

సిన్సియర్ బాక్సింగ్ కోచ్ ఆదిత్య (వెంకటేష్).. తన ముక్కుసూటితనం, కోపం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. బాక్సింగ్ అసోసియేషన్ లో జరిగే రాజకీయాల వల్ల ఢిల్లీ నుంచి వైజాగ్ కు బదిలీ అయిన ఆదిత్య తనేంటో రుజువు చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో కూరగాయలు అమ్ముకుని బతికే పేదింటి అమ్మాయి రామేశ్వరి (రితికా సింగ్) ఆదిత్యకు కనిపిస్తుంది. రామేశ్వరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమెకు బాక్సింగ్ శిక్షణ ఇవ్వడం మొదలుపెడతాడు. ఇతరుల వల్ల ఆదిత్య, రామేశ్వరి ఇద్దరూ అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. వారు వాటిని అధిగమించి ఛాంపియన్ బాక్సర్ గా ఎలా తీర్చిదిద్దాడన్నది మిగతా కథ. రామేశ్వరిగా కొత్తమ్మాయి రితికా సింగ్ అదరగొట్టింది. ఇక బాక్సింగ్ కోచ్ గా వెంకీ .. తనదైన శైలిలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడ. నిజానికి ఈ సినిమా ఇరుదు సుట్రు అనే తమిళ సినిమాకు రీమేక్ వెర్షన్. మాధవన్ హీరోగా నటించిన ఈ సినిమాకు కూడా సుధా కొంగరే దర్శకురాలు.

Leave a comment

error: Content is protected !!