ప్రస్తుతం అందరి దృష్టి నేచురల్ స్టార్ నానీ,సుధీర్ బాబు నటించిన థ్రిల్లర్ మూవీ ‘వి’ మీదే ఉంది. ఈ అర్ధరాత్రి 12 గంటలనుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిపోవడానికి రెడీ అయిపోయింది సినిమా. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 25నే విడుదల కావాలి. లాక్ డౌన్ కారణంగా ఆరు నెలలపాటు విడుదలను వాయిదా వేసుకుంది. థియేటర్స్ తెరవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి.. తప్పనిసరిగా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. థియేటర్స్ కోసం ఆగితే.. సినిమా మీద బజ్ పూర్తిగా పోయే ప్రమాదం ఉండడంతో .. ఓటీటీలో విడుదలవుతోన్న తొలి తెలుగు స్టార్ హీరో సినిమాగా ‘వి’ విశేషాన్ని సంతరించుకుంది. నానీ, సుధీర్ బాబు పోటీపడి నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ కు అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.
నానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ , సినిమాపై ఉన్న అంచనాల కారణంగా భారీగానే జనాలు చూసే అవకాశం ఉందంటున్నారు. అమెజాన్ ప్రైమ్ కు తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ కనీసం పది లక్షల మంది సబ్ స్ర్కైబర్స్ అయినా ఉంటారు అనేది విశ్లేషకుల మాట. ఒక్కో సబ్ స్క్రైబర్ తన యూజర్ నేం మరియు ఫాస్ వర్డ్ ను ఇద్దరు ముగ్గరితో షేర్ చేసుకుని ఉంటారు. కనుక సినిమాను చూడబోతున్న వారి సంఖ్య భారీగానే ఉంటుందనిపిస్తుంది. అయితే ఈ రోజు రాత్రి చూసేవారి సంఖ్యతో 13 నుండి 15 మిలియన్ ల మినిట్స్ వ్యూస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది ఇప్పటి వరకు విడుదలైన ఇండియన్ టాప్ మూవీస్ జాబితాలో చేరే అవకాశం ఉందంటున్నారు. నాని సినిమాకు వచ్చే ఆదరణను బట్టి టాలీవుడ్ నుండి మిగతా స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్ని విడుదల చేయడానికి ముందుకొచ్చే అవకాశాలున్నాయి . మరి ‘వి’ చిత్రం సక్సెస్ టాలీవుడ్ కు సరికొత్త దారి చూపిస్తుందేమో చూడాలి.