ఈ రోజుల్లో ఒక పెద్ద హీరో సినిమా విడుదలవడానికే సంవత్సరాల కాలం పట్టేస్తోంది. పోనీ అలా విడుదలవుతోన్నా.. ప్రకటించిన విడుదల తేదీలో పక్కాగా విడుదల చేయడం మాత్రం సాధ్యం కావడం లేదు. దానికి ఎన్నో సాంకేతిక కారణాలు ఉంటాయి. మరి ఒకప్పుడు ఒకో హీరో .. సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలకు తక్కువలేకుండా సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకొనేవారు. ఆ తర్వాత నైంటీస్ కొచ్చేసరికి చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున లాంటి స్టార్ హీరోలు.. సంవత్సరానికి రెండు సినిమాలకు తక్కువ కాకుండా చూసుకొనేవారు. ఆ క్రమంలోనే అప్పట్లో బాలయ్య ఒక రికార్డు క్రియేట్ చేశాడు.

అదేంటంటే.. ఆయన రెండు సినిమాలు ఒకే విడుదల తేదీలో విడుదలయ్యాయి. 1993, సెప్టెంబర్ 3న  ‘బంగారు బుల్లోడు, నిప్పురవ్వ’ సినిమాలు విడుదలై.. అప్పట్లో సంచలనమయ్యాయి. అయితే వాటిలో ‘బంగారుబుల్లోడు’ సూపర్ హిట్టయితే.. ‘నిప్పురవ్వ’ మాత్రం అభిమానుల్ని నిరాశపరిచింది.  ఈ రెండు సినిమాలు విడుదలై.. నేటికి 27 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంతకు ముందు..అంటే.. 1984 సంక్రాంతికి  సూపర్ కృష్ణ నటించిన యుద్ధం, ఇద్దరు దొంగలు విడుదలై… అప్పట్లో అభిమానుల్ని అలరించాయి. కాకపోతే.. ఆ రెండూ మల్టీస్టారర్ చిత్రాలే . అయితే .. ఇదే బాలయ్య రికార్డు ను … ఈ తరం హీరో అయిన నానీ .. సమం చేశాడు. అతడి ‘జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం’ ఒకేరోజు విడులయ్యాయి. అందులో ఎవడే సుబ్రహ్మణ్యం మాత్రమే  సక్సెస్ అయింది.

Leave a comment

error: Content is protected !!