చిత్రం: 777 చార్లీ
నటి నటులు:రక్షిత్ శెట్టి, సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, బాబీ సింహా తదితరులు
సంగీతం: నోబిన్ పాల్
ఛాయాగ్రహణం: అరవింద్ కశ్యప్
నిర్మాత: రక్షిత్ శెట్టి – జి.ఎస్.గుప్తా
నిర్మాణ సంస్థ : పరమావ్ స్టూడియోస్
దర్శకత్వం: కిరణ్ రాజ్
విడుదల తేదీ : జూన్ 10, 2022
మోస్ట్ ప్రామిసింగ్ కన్నడ ఇండస్ట్రీ హీరోల్లో రక్షిత్ శెట్టి ఒకరు. ఈయన కథానాయకుడిగా తెరకెక్కిన ఎమోషనల్ సినిమా “777 చార్లీ”. ఓ లాబ్రడార్ డాగ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం ప్రత్యేకంగా జంతు ప్రేమికుల కి అని చెప్పచ్చు. ఇప్పటికే, ట్రైలర్, అద్భుతమైన సాంగ్స్ తో అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రం కోసం ఫ్యామిలీ నుంచి చిన్న పిల్లలు దాకా వెయిట్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పబ్లిక్ ని ఆకట్టుకుంటుందో లేదో చూద్దాం..!!
కథ:
ధర్మ (రక్షిత్ శెట్టి) తన కుటుంబాన్ని యాక్సిడెంట్ లో పోగుట్టుకొని ఒంటరి తనంతో తన లైఫ్ ని కొనసాగిస్తుంటాడు. ఒక రోజు తన ఇంటి దగ్గర లో కుక్క కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్న ధర్మ, ఆ కుక్క తో చాలా ఎమోషనల్ గా దగ్గరవుతాడు. ఓ రోజు కుక్క గురించి ఊహించని అంశం తెలుసుకుంటాడు. ఆ అంశం తెలుసుకున్న తరువాత ధర్మ లో చేంజ్ వస్తుంది. మరి ఇంతకీ ఆ అంశం ఏంటి? ఆ కుక్క కి ఏమవుతుంది? ఇవ్వన్నీ తెలియాలి అంటే ఈ సినిమా చుడాలిసిందే.
కధనం,విశ్లేషణ
మనుషులకి, జంతువులకి మధ్య కొనసాగే ఎమోషనల్ బంధం ఇప్పటిది కాదు. వీటిపై వచ్చే సినిమాలు ఎప్పుడూ భావోద్వేగంగానే అనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకి అత్యంత దగ్గరైన జీవి శునకం. ఇలాంటి సబ్జెక్ట్ పైన సినిమా అంటే సాహాసమనే చెప్పాలి. అంతేకాదు, ఎంతో ఎమోషనల్ గా ఉంటాయి. ఈ సినిమాలో చార్లీ మరియు ధర్మ ల మధ్య ఎమోషన్స్ సీన్స్ టాప్ నాచ్, క్లైమ్యాక్స్‌లో అయితే ఏడిపించేస్తాడు రక్షిత్ శెట్టి. చార్లీ నుంచి కూడా అద్బుతంగా నటన రాబట్టారు. పెట్ లవర్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
రక్షిత్ శెట్టి నటన సెన్సిబుల్ గా ఉంటూ హృదయానికి హత్తుకునేలా కనబరిచాడు. అలాగే సిట్యుయేషన్ కి తగ్గట్టు యాక్టింగ్ లో షేడ్స్ చూపిస్తుంటాడు. ముఖ్యమైన పాత్రలో కనిపించిన బాబీ సింహ సీన్స్ ఎంతో ఎమోషనల్ గా సాగుతుంది. వీళ్ళతో పాటు సంగీత సింగేరి అలాగే రాజ్ బి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేసారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే సెగ్మెంట్స్ విజువల్‌గా అద్భుతంగా ఉంటాయి. సంగీత శృంగేరి అమాయకమైన పాత్రలో భలే నటించింది. తన క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చి ఉంటె బాగుండు.
ఈ సినిమా కూడా అన్ని తరహా సినిమాల్లానే రొటీన్ ప్లాట్ అయ్యినప్పటికీ భావోద్వేగమైన సన్నీ వేశాలు ఉండటం వల్ల పర్వాలేదు అనిపిస్తుంది. సినిమా లెంత్ కూడా కాస్త ఎక్కువ కావడం. అక్కడక్కడ స్లో గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. వీటన్నిటితో పాటు కొన్ని సన్నివేశాలు బలంగా రాసుకోవాలిసింది. కొన్ని లాజిక్ లు మిస్ అయ్యాయి.
నటి నటుల పెర్ఫామెన్స్:
ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది అంటే దానికి కారణం “రక్షిత్ శెట్టి”. ఈ హీరో యాక్టింగ్ కి అందరు ఫిదా అవ్వాలిసిందే. చార్లీ తో కలిసి పండించే ఎమోషన్ సీక్వెన్స్ మరో స్థాయిలో ఉంటాయి. చార్లీ పాత్ర లో నటించిన చార్లీ కి టెక్ ఏ బౌ అంత అద్భుతంగా చేసింది. హీరోయిన్ సంగీత శృంగేరి తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది.
సాంకేతిక వర్గం:
దర్శకుడు కిరణ్ రాజ్ ఎమోషన్స్ ని స్క్రీన్ మీద బాగా పండించగలిగాడు. మిగతా అంశాలు కూడ బాగా రాసుకొని ఉంటే, ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చేది. ఓవరాల్ గా అయితే బాగా రాణించారు. సంగీత దర్శకుడు నోబిన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చెయ్యాల్సింది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: ఎమోషనల్ “చార్లీ”
Review – TirumalaSetty Venkatesh Naidu