చిత్రం: 7డేస్ 6నైట్స్
నటి నటులు:సుమంత్ అశ్విన్, రోహాన్, మెహర్ చాహర్, కృతికా శెట్టి, రమణ గోపరాజు, జునైద్ సిద్ధిఖీ
సంగీతం:సమర్థ్ గొల్లపూడి
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాత: సుమంత్ అశ్విన్, రజినీకాంత్
రచన, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు
మూవీ రిలీజ్: జూన్ 24,2022

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు “డర్టీ హరి” సూపర్ హిట్ సినిమా తరువాత, దర్శకత్వం వహించిన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు “సుమంత్ అశ్విన్” హీరో. ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాను మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో, సుమంత్ అశ్విన్ ఎం.రజనీకాంత్ ఎస్ కలిసి నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. సినిమా టైటిల్ తోనే కుర్ర కారులని ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్ లో రీలిజ్ అయ్యింది మరి సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం?.

కథ: మంగళం(రోహాన్) & సుమంత్ అశ్విన్(ఆనంద్) ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. రోహాన్ బ్యాచలర్ పార్టీ కి సుమంత్ అశ్విన్ తో కలిసి ఇద్దరు గోవా కి వెళ్తారు. సుమంత్ అశ్విన్ ఒక గొప్ప డైరెక్టర్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పటికే గోవా లో కాస్త పరిచయం ఉన్న మెహర్ చాహర్(రతిక) ద్వారా కృతికా శెట్టి(యామియా – లొకేషన్ మేనేజర్) పరిచయమవ్వుతుంది. ఇంతలో ప్రేమించిన అమ్మాయి, ఏ జాబ్ లేని కారణంగా వేరే వాడితో పెళ్లి చేసుకున్న విషయం తెలుస్తుంది. ఆ బాధలో సుమంత్ అశ్విన్ అనుకోకుండా రతిక తో ప్రేమ లో పడతాడు. మంగళం(రోహాన్) కృతికా శెట్టి తో ప్రేమలో పడతాడు? వీల్లద్దరిలో ఎవ్వరి ప్రేమ సక్సెస్ అయ్యింది అనేది కథ?

కధనం,విశ్లేషణ:
బ్యాచలర్ పార్టీ అనగానే మొదట గా గుర్తుచ్చొది “గోవా”. గోవా లో సాగిన ‘7 డేస్ 6 నైట్స్’ సినిమా లో సుమంత్ అశ్విన్ యాక్టింగ్ చాలా మెట్యూర్డ్ సటిల్డ్ గా యాక్ట్ చేసి తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో సుమంత్ అశ్విన్ తండ్రి తో సాగే సీన్స్ ఫన్నీ గా ఆకట్టుకుంటాయి. ఈ మధ్య రమణ గోపరాజు గారు చేసే ప్రతి సినిమా క్యారెక్టర్ లో బాగా రాణిస్తున్నారు. మెహర్ చాహర్ తన నటనతో డీసెంట్ గా రాణించింది. కానీ తన క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్ బిల్డ్ చేసి, స్క్రీన్ స్పెస్ ఇచ్చి ఉంటె బాగుండు అనిపిస్తుంటుంది. ఈ అమ్మాయి కి రాబోయ్యే సినిమాలో మంచి ఫ్యూచర్ ఉంది. కృతికా శెట్టి అందచందాలతో స్క్రీన్ మీద సెగలు పుట్టించింది.

ఈ సినిమా కి హైలైట్ రోహాన్ నటన, స్ల్యాంగ్. ఈ క్యారెక్టర్ లో లీనమై యూత్ బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. ఎందుకంటే, ప్రతి ఒక్కరు తన లా ఛిల్ల్ అవ్వాలనే కోరుకుంటారు. ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ స్పెషల్ అప్పియరెన్స్ బాగుంటుంది.

అక్కడక్కడ సినిమాలో బోరింగ్ సన్నివేశాలు, ఆడీయన్స్ ఎక్సపెక్ట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ఇలాంటివి లేకపోవడం డిస్స్పాయింట్ గా అనిపించినా సినిమా చాలా జోవియల్ గా రాణించడంలో సక్సెస్ అయ్యారు ఎం.ఎస్. రాజు గారు.

నటి నటుల పెర్ఫామెన్స్: సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో చాలా డీసెంట్ అండ్ సటిల్డ్ గా యాక్ట్ చేసారు. రోహన్ కొత్తవాడైన నటన మరియు మంచి కామిడి టైమింగ్ స్లాంగ్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటాడు. మెహర్ చాహర్, కృతికా శెట్టి ఇద్దరు తమ పాత్ర మేరకు బాగా రాణించారు. ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ స్పెషల్ అప్పీరియన్స్ తో యాక్టింగ్ బాగానే రాణించారు.

సాంకేతిక వర్గం: ఎం.ఎస్. రాజు గారు ఓల్డే కావచ్చు కానీ, అయ్యన ఇండస్ట్రీ కి గోల్డ్ లాంటి వ్యక్తి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు జెనరేషన్ కి తగ్గట్టు స్క్రిప్ట్ ఎంచుకొని, ఎక్క్యూట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇకపోతే, సినిమా లైన్ బాగున్న కథ మీద ఇంకా శ్రద్ద తీసుకునే ఉంటే బాగుండు. మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి ఏజ్ లో చాలా చిన్న వాడైనా మ్యూజిక్ అదరకొట్టారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ పని తీరు బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించాయి.

రేటింగ్: 2.75/5

బాటమ్ లైన్: ఫ్యామిలీ తో చూడదగ్గ సినిమా “7డేస్ 6నైట్స్”

Review by – Tirumalashetty Venkatesh

Leave a comment

error: Content is protected !!