పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6 జర్నీ’ టీజర్‌ను గురువారం ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, నటీనటులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
బసీర్ అలూరి దర్శకత్వం వహిస్తున్నారు. పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీజర్ విజువల్స్, ఆర్ఆర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజర్ చాలా బాగుందని, సినిమా టీంకు శుభాకాంక్షలు తెలిపారు.
సినిమా టీం, హీరో సమీర్ దత్త, నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి, హీరోయిన్లు, సంగీత దర్శకుడు సింహ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా అద్భుతంగా వచ్చిందని, టీజర్ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమీర్ దత్త, పల్లవి, రమ్యా రెడ్డి, అవంతిక, టేస్టీ తేజ తమ పాత్రల గురించి మరియు సినిమా టీంపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

Leave a comment

error: Content is protected !!