‘అశ్వథ్థామ’ చిత్రంతో డీసెంట్ హిట్టు కొట్టాడు నాగశౌర్య. సొంత కథతో సొంత బ్యానర్ పై ఆ సినిమా తెరకెక్కించి.. మంచి లాభాలే మూటగట్టుకొన్న ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా మరో రెండు చిత్రాల్ని ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ మీదున్నఅతగాడి తదుపరి చిత్రం గురించి కూడా ఇప్పుడో అప్డేట్ వచ్చింది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే వెరైటీ టైటిల్ ను ఖాయం చేసుకున్న ఈ సినిమా ఆల్రెడీ 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలో ఉండడంతో.. ప్రస్తుతం చిత్ర బృందానికి వీసా ఇప్పించే ఏర్పాట్లల్లో ఉన్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకొని.. ఆగిపోయిందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో చిత్రం గురించి తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్ . ఈ సినిమా ఆగిపోలేదని, వీసా మంజూరు లో ఆలస్యం జరగుతోందని క్లారిటీ ఇచ్చారు. ఊహలు గుసగుసలలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలు వరుసగా సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమా విషయంలో మంచి అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.