Shopping Cart 0 items - $0.00 0

30రోజుల్లో ప్రేమించడం ఎలా? అంటోన్న యాంకర్ ప్రదీప్

టెలివిజన్ రంగంలో అతి చిన్న వయసులోనే యాంకర్ గా విపరీతమైన పాప్యులారిటీ తెచ్చుకున్న యాంకర్..  ప్రదీప్ మాచిరాజు. ఇంతవరకూ మనోడు చేసిన షోస్ అన్నీ దాదాపు సూపర్ హిట్టయ్యాయి. యాంకర్ గా చేస్తూనే .. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే పోషించిన ప్రదీప్ .. ఇప్పుడు హీరోగా కొత్త టర్న్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఒక సినిమాలో హీరోగా నటించినా.. ఆ సినిమా ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు మరో చిత్రంతో ప్రదీప్ మాచిరాజు హీరో అయిపోయాడు.

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?’ అనే మూవీతో ప్రదీప్ మాచిరాజు హీరోగా రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఎనర్జిటిక్  పెర్ఫార్మెన్స్ తో మంచి కామెడీ టైమింగ్ తో  ఇతగాడు నటించిన ఈ మూవీ కి మున్నా అనే కొత్త కుర్రోడు దర్శకుడు. యస్వీ బ్యానర్ లో యస్వీ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో అమృత అయ్యర్ అనే కొత్త అమ్మాయి కథానాయికగా నటిస్తోంది.

Leave a comment

error: Content is protected !!