లంబసింగి అనగానే చల్లని , ఆహ్లాదకరమైన, అద్భుతమైన ప్రాంతం. లంబసింగి ని ఆంధ్రా కాశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. ఆంధ్రా టూరిజంలో లంబసింగి ప్రాధాన్యత ఉంది. ఈ ఊరిపేరుతో ఓ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి నవీన్‌ గాంధీ దర్శకత్వం వహిస్తుంటే.. కళ్యాణ్‌కృష్ణ కురసాల సమర్పిస్తున్నారు.కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. భరత్‌ రాజ్‌ డెబ్యూ ఇస్తున్న ఈ మూవీలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివివద్యా హీరోయిన్. లంబిసింగికి ఏ ప్యూర్ లవ్‌స్టోరీ అనే ట్యాగ్‌లైన్ ఆకర్షిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకుని మార్చి 15 రిలీజ్‌ కాబోతుంది. ఈసినిమా నుంచి . ‘నచ్చేసిందే నచ్చేసిందేఅంటూ సాగే పాటకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు వయ్యారి గోదారి అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీ గా సాగే ఈ సోంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

Leave a comment

error: Content is protected !!