1989 లో శివ మూవీ లో చిన్న పాత్ర చేయడం తో ఎంట్రీ..
ఆ తర్వాత కృష్ణవంశీ దగ్గర మనీ మనీ, గులాబి , నిన్నే పెళ్ళాడుతా చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అనుభవం పూరి ఫస్ట్ సినిమా బద్రి …ఐతే ఈ సినిమా ముందు సుమన్ తో పాండు, కృష్ణ  తో థిల్లాన సినిమాలు అనౌన్స్ అయ్యి ఆఫీసులు తీసి , కొంచెం షూటింగ్ పార్ట్ తీసిన తర్వాత ఆగిపోయాయి. ఇది జరిగిన దాదాపు నాలుగేళ్ళకి బద్రి ఓకే అయ్యింది. సినిమా 2000 సంవత్సరం ఇదే రోజు రిలీజ్  అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్…కానీ డైరెక్టర్ అవ్వాలనే ఈ ప్రాసెస్ కి దాదాపు ఎనిమిది నుంచి పదేళ్ళు పట్టింది. ఇందులో సినిమా ఆగిపోయినప్పుడు సినిమా సర్కిల్స్ లో ఫ్రెండ్స్ లో ఎంకరేజ్ చేసే వాళ్ల కన్నా డిస్కరేజ్ చేసే వాల్లే ఎక్కువుంటారు. కొంతమందైతే వీడు ఐరన్ లెగ్ రా ఎంత లెగ్ కాకుంటే సూపర్ స్టార్ కృష్ణ తో సినిమా ఆగిపోవడమేంటి . వీడు డైరెక్టర్ అవ్వడు…అంటూ కామెంటు చేసిన వాళ్ళు కూడ లేకపోలేదు . సినిమా కథ చెప్పడానికి గోల్కొండ షూటింగ్ లొకేషన్ కి రమ్మన్ని అక్కడికి నడుచుకుంటూ వెల్లే సరికి ..అక్కడ సార్ మిమ్మల్ని మాసబ్ టాంక్ దగ్గరున్న గోల్కొండ హొటల్ కి రమ్మన్నారు అని చెబితే మరి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఓ హీరో కి కథ చెప్పడం…..అది ఆయనకు నచ్చక పోవడం… ఇలాంటి వెన్నో ప్రాబ్లంస్ టైం లో కూడ సినిమా మీద నమ్మకం తో నిలబడ్డం అనేది అందరికి సాధ్యమవ్వదు. ఇలా నిలబడి ఎన్నో విజయాలు అందుకున్న తర్వాత మిత్రుడి మోసం ..ఎంతో నష్టం ..ఎంతగా అంటే సొంత ఇల్లు అమ్ముకునే పరిస్థితి. .. తను పెంచుకుంటున్న పెట్స్ కి భోజనం పెట్టలేక వాటిని అమ్మినప్పుడు పూరి పడ్డ బాధ ……ఆ బాధ లోంచి ..మళ్ళీ నిలబడి విజయం వైపు పయనించడం ..అనేది అందరికి సాధ్యపడదు….సాధ్యపడాలంటే నిలబడాలి ..ఎన్ని కష్టాలు వచ్చిన …వెనకడుగు మాత్రం వేయకూడదు ..అల నిలబడి ఎంతో మంది కి ఇన్స్పిరేషన్ ఐన పూరి ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్ళు ఐన సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతోంది మూవీ వాల్యూం.

 

 ఎప్పటికీ ‘నేనింతే’ పూరి జగన్నాధ్ – సినీ ప్రయాణం  డీటైల్ గా 

పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో సినిమాలు తీస్తూ బుల్లెట్ లా దూసుకుపోతున్న డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్. ఇతర దర్శకులతో పోలిస్తే పూరి వర్కింగ్ స్టైల్ & టేకింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అది సినిమా టైటిల్ దగ్గర నుండి హీరో హీరోయిన్స్ క్యారెక్టరైజెషన్ తో పాటు కామెడీ, విలనిజం, డైలాగ్స్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక విషయంలోనూ పూరీ మార్క్ ప్రత్యేకమే అని చెప్పాలి. పూరి హీరో కోసమో కథలు రాసుకోడు… స్టార్ హీరోల డేట్స్ కోసం ఎప్పుడు ఎదురు చూడడు. వన్స్ ఒకసారి కథ రెడీ అవ్వగానే ఆ సమయంలో ఏ హీరోకి అయితే ఈ కథ బాగా యాప్ట్ అనిపిస్తే ఆ హీరోకి స్టోరీ లైన్ వినిపించడం డేట్స్ తీసుకోవడం సినిమాని చకచకమనీ పట్టాలెక్కించి నాలుగైదు నెలలో తీయడం. ఇది పూరికి తెలిసిన సినిమా మేకింగ్.

తన మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా మారి ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కదా ఇండస్ట్రీకి కావాల్సిందని ప్రముఖుల ప్రశంసలు అందుకున్న పూరికి దర్శకుడు అవ్వడానికి 8 నుండి 10 ఏళ్ల సమయం పట్టింది ఈ విషయం చాలా మందికి తెలియక ఉండక పోవచ్చు. ఆయన డైరెక్టర్ అవ్వడానికి పడిన శ్రమ.. ఆదిలోనే తనకు ఎదురైన అపజయాలు… సినిమా మొదలయ్యి ఆగిపోయిన సినిమాలు వంటి ఆసక్తికరమైన విషయాలు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్ళైన సందర్భంగా అందిస్తుంది మూవీ వాల్యూం…

సినీ ప్రయాణం :

పూరీ… రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సంచలన చిత్రం ‘శివ’(1989)లో చిన్న పాత్రలో వెండితెరపై తళ్లుకున్న మెరిశాడు. కట్ చేస్తే… సినిమాలపై ఉన్న అమితమైన ఇష్టంతో తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర మనీ మనీ, గులాబి , నిన్నే పెళ్ళాడుతా చిత్రాలకు గాను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అనుభవం పూరి సొంతం. ఆ అనుభవంతో చేసిన ఫస్ట్ సినిమా ‘బద్రి’(2000). ఆ సినిమాలో ‘నువ్వు నందా అయితే… నేను బద్రి బద్రీనాథ్’ అంటూ పవన్ చెప్పిన ఆ డైలాగ్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేయించాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 21 ఏళ్లు పూర్తయ్యింది. అలా డైరెక్టర్ గా తన పేరును సిల్వర్ స్క్రీన్ మీద డైరెక్టర్ గా చూసుకోవాలనే కలకీ, తను పడిన శ్రమకి మధ్య జరిగిన ప్రాసెస్ కి దాదాపు ఎనిమిది నుంచి పదేళ్ళు సమయం పట్టింది. పూరీ తొలి సినిమా కంటే ముందుగా సుమన్ తో ‘పాండు’, కృష్ణ గారి తో ‘థిల్లాన’ వంటి సినిమాలు అనౌన్స్ అయ్యి ఆఫీసులు తీసి కూడా… ఆ సినిమాల షూటింగ్ కొంచెం పార్ట్ తీసిన తర్వాత మధ్యలో ఆగిపోయాయి. ఇలా సినిమాలు ప్రకటించి ఆదిలోనే అవాంతరాలు ఏర్పడి ఆగిపోయిన దాదాపు నాలుగేళ్ళకి ‘బద్రి’ సినిమా ఓకే అయ్యింది. మొదట్లో సినిమా ఆగిపోయినప్పుడు తనని సినిమా సర్కిల్స్ లోని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసే వాళ్ల కన్నా కూడా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ. కొందరైతే ఏకంగా వీడు ఐరన్ లెగ్ రా ఎంత లెగ్ కాకుంటే సూపర్ స్టార్ కృష్ణ తో సినిమా ఆగిపోవడమేంటి. ఇక వీడు డైరెక్టర్ అవ్వడం అసాద్యం… అంటూ కామెంటు చేసినోళ్లు కూడా లేకపోలేదు. తను రాసుకున్న సినిమా కథను చెప్పడానికి గోల్కొండ షూటింగ్ లొకేషన్ కి రమ్మంటే అక్కడికి నడుచుకుంటూ కాలినడకన వెళ్ళేసరికి… అక్కడివారు సార్ మిమ్మల్ని మాసబ్ టాంక్ దగ్గరున్న గోల్కొండ హొటల్ కి రమ్మన్నారు అని చెబితే మరి అక్కడికి కూడా నడుచుకుంటూ వెళ్ళి ఓ హీరో కి కథ చెప్పడం… అది ఆయనకు నచ్చక రిజక్ట్ అవ్వడం… ఇలాంటివి న్నో ప్రాబ్లంస్ ఎదురైన కూడ సినిమా తీయగలననే నమ్మకంతోనే నిలబడ్డం అనేది అందరికి సాధ్యమయ్యే విషయం కాదు. ఇలాంటి గడ్డు పరిస్థితులకు తలొగ్గక నిలబడి డైరెక్టర్ అయిన తర్వాత ఎన్నో వరుస విజయాలు అందుకుని డేరింగ్ & డాషింగ్ అని పేరు సొంతం చేసుకున్నాడు పూరి. అలా సక్సెస్ లో ఉన్న సమయంలో ఊహించని మిత్రుడి మోసం…తో మళ్ళీ పతన స్థాయికి పడిపోయాడు. ఎంతలా అంటే సొంత ఇల్లు అమ్ముకునే పరిస్థితి… తను పెంచుకుంటున్న పెట్స్ కి భోజనం పెట్టలేక వాటిని అమ్మినప్పుడు పూరి పడ్డ బాధ… ఆ బాధలోంచి ఇస్మార్ట్ పూరి కం బ్యాక్ అంటూ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ తో నిలబడి విజయం వైపు పయనించడం… అనేది అందరికి సాధ్యపడదు… అలా సాధ్యపడాలంటే నిలబడాలి… ఎన్ని కష్టాలు వచ్చిన… వెనకడుగు మాత్రం వేయకుండ… ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు పూరి. ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్ళైన సందర్భంగా సక్సెస్ఫుల్ గా తన జర్నీ సాగాలని కోరుకుంటూ కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతుంది మూవీ వాల్యూం.

ఎప్పటకి నిల్చిపోయే పూరి మార్క్ డైలాగ్స్ :

‘నువ్వు నందా అయితే… నేను బద్రి బద్రీనాథ్’

‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు’

‘సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు చంటిగాడు లోకల్’

‘జీవితం ఎవ్వడినీ వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది’

Leave a comment

error: Content is protected !!