సినీప్రేక్షకులను గడిచిన మూడు నెలల్లో డజన్ పైగా సినిమాలు విడుదలైన కుడా బాగా అలరిచిన సినిమాలు కేవలం ‘క్రాక్’, ‘ఉప్పెన’ & ‘జాతి రత్నాలు’. ఇందులో చిన్న సినిమాగా వచ్చిన ‘జాతి రత్నాలు బ్ల్లాక్ బస్టర్ చిత్రంగా వసూళ్లను రాబట్టింది. ఇక  ఈ వేసవిలో వినోదం పంచేందుకు ఏప్రిల్ మొదటి వారంలో యువరత్న, నాగార్జున ‘వైల్డ్ డాగ్’ కార్తీ ‘సుల్తాన్’ సినిమాలు రానున్నాయి. 

ఏప్రిల్ నెల లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు   

ఈ రోజు కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ డబ్బింగ్ చిత్రం యువరత్న నేడే రిలీజ్ అయ్యింది.

‘వైల్డ్ డాగ్’

నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్’. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో సాగుతుంది. దియా మీర్జా, సయామీ ఖేర్‌, అలీరెజా, అతుల్‌ కులకర్ణి వంటి నటులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంగీతం తమన్. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు.

‘సుల్తాన్’

కార్తి, రష్మిక మందన జంటగా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న సినిమా  ‘సుల్తాన్’. సినిమాకి ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం వివేక్ మెర్విన్.

ఏప్రిల్ 9న రానున్న ‘వకీల్ సాబ్’

పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ మూవీ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న రాన్నుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 16న వస్తున్న ‘లవ్ స్టోరి’

‘ఫిదా’ లాంటి క్లాసిక్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’ ఈ సినిమాల్లో సున్నితమైన భావోద్వేగాలను అత్యంత సున్నితంగా తెరపై చూపిస్తున్నాడు శేఖర్ కమ్ముల. సినిమాకి సంగీతం పవన్ సి.ఎచ్. సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు.

ఏప్రిల్ 23న వస్తున్న ‘టక్ జగదీశ్’

నాని కథానాయకుడిగా, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ నాయికలుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీశ్’. ఈ చిత్రంలో నాని అన్నగా జగపతిబాబు బాబు, తండ్రిగా నాజర్ నటించారు. డేనియల్ బాలాజీ, ప్రియదర్శి, తిరువీర్, రోహిణి, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.  ఈ చిత్రానికి సంగీతం తమన్‌, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ ౩౦న రానున్న ‘విరాటపర్వం’

రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న చిత్రం ‘విరాటపర్వం’. సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డి. సురేశ్‌బాబు సమర్పకుడి వ్యవహరిస్తున్నాడు.

ఈ చిత్రాలే కాదు మరికొన్ని చిత్రాలు కూడ ఏప్రిల్ నెలలో రిలీజ్ కాబోతున్నాయి.

 

Leave a comment

error: Content is protected !!