అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’  చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ నుంచి వెళ్ళిపోయినా .. అందులోని పాటలు ఇంకా శ్రోతల హృదయాలను వీడిపోలేకపోవడం విశేషం. ముఖ్యంగా ‘రాములో రాములా’ పాటను  .. యూ ట్యూబ్ లో వీక్షించే వారి సంఖ్య ఇంకా పెరుగుతునే ఉంది. రికార్డు స్థాయిలో ఆ పాట ఆల్రెడీ 200 మిలియన్స్ వ్యూస్ దాటి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

యస్.యస్.తమన్ కెరీర్ లోనే అత్యధిక పాపులారిటీని తెచ్చుకున్న పాట గా రాములో రాములా నిలిచిపోయింది.  అల్లు అర్జున్ వెరైటీ స్టెప్స్ ఆ పాటకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. యూ ట్యూబ్ లోని ఈ పాట జోరు చూస్తుంటే.. 300 మిలియన్స్ వ్యూస్ ను దాటిపోయినా ఆశ్చర్యం లేదు. ‘అల వైకుంఠపురములో’ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ కురిపించడం ఒక ఎత్తైతే.. ఇందులోని పాటలు కొత్త రికార్డుకు  నాంది పలకడం .. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి రాములో రాములా ఇంకా ఏ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!