Shopping Cart 0 items - $0.00 0

20వ శతాబ్దం

 

యాక్షన్ హీరో సుమన్ కెరీర్ ను సరికొత్త మలుపుతిప్పిన చిత్రం ‘20వ శతాబ్దం’. కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1990 లో విడుదలై ఘనవిజయం సాధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు తో స్మగ్లింగ్ చేసే కథానాయకుడు చివరికి అతడి ట్రాప్ లోనే పడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. 20వ శతాబ్దంలో రాష్ట్ర రాజకీయాలు, నేరాలు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలియచెప్పిన చిత్రమిది. సుమన్, దేవరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రిపోర్టర్ గా లిజి నటించగా.. అతిథిపాత్రలో కన్నడ కథానాయిక సుమన్ రంగనాథ్ కనిపిస్తుంది. జె.వీ.రాఘవులు సంగీత సారధ్యంలో ‘మన ప్రేమ నవపారిజాతం, అమ్మను మించిన దైవమున్నదా’ అనే పాటలు అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. నిజానికి ఈ చిత్రం 1987 లో మలయాళంలో బ్లాక్ బస్టరైన మోహన్ లాల్ ‘ఇరుపత్తామ్ నూట్టాండు’ చిత్రానికి రీమేక్ వెర్షన్. సాగర్ అలియాస్ జాకీ గా మోహన్ లాల్ నట విశ్వరూపం చూపించిన ఈ సినిమా ఆ తర్వాత కన్నడలో అంబరీష్ హీరోగా ‘జాకీ’గా రీమేక్ అయింది. ఆ తర్వాతే తెలుగులో ‘20వ శతాబ్దం’గా రీమేక్ అవడం విశేషం.

Leave a comment

error: Content is protected !!