శ్రీదేవి.. ఈ పేరు వినని సినీ లవర్ ఉన్నాడంటే నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే శ్రీదేవి అన్ని భాషా ప్రేక్షకులను అలరించిన నటి. బాలీవుడ్‌లో దశాబ్ధాల పాటు నెంబర్ వన్ గా ఏలిన తార శ్రీదేవే. ఇంత క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రీదేవి నిర్మాతగా మారి మెగాస్టార్‌తో కలిసి నిర్మించాలనుకున్న చిత్రం వజ్రాల దొంగ. 1980లో ఈ మూవీ టాలీవుడ్‌లో ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే టాప్ లీడ్ హీరోయిన్ గా వున్న శ్రీదేవి నిర్మాతగా చిరంజీవి హీరోగా సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అంతే కాదు ఈ మూవీ ఓపెనింగ్ కూడా చాలా భారీగా జరిగింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ ఈ మూవీకి క్లాప్ కొట్టగా దర్శకరత్న దాసరి మొదటి సీన్‌కు డైరెక్షన్ చేసారు.
ఆ తరువాత ఏవిఎం స్టూడియోలో వజ్రాలదొంగ కోసం ఒక సాంగ్ కూడా షూట్ చేసారట. కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ అప్పట్లో చాలా సెన్సేషనే క్రియేట్ చేసింది. ఇంత హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.