Shopping Cart 0 items - $0.00 0

హాట్ అవతారమెత్తిన రత్తాలు

అవకాశాల కోసం ఇన్ స్టా ను ఆశ్రయించి.. బికినీ సొగసులతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన అందాల రత్తాలు .. ఇప్పుడు   డిజిటల్ ప్లాట్ ఫామ్ ను సైతం హీటెక్కించనుంది.  అమ్మడు మొట్టమొదటసారిగా ఒక హాట్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. పాయిజన్ సెకండ్ సీజన్ కోసం రాయ్ లక్ష్మి హాట్ అవతారమెత్తుతూ .. బాలీవుడ్ జనానికి హీట్ పుట్టించబోతోంది. జీ5 లో ఏప్రిల్ 30న స్ట్రీమింగ్  కానున్న ‘పాయిజన్ 2’ లో రాయ్ లక్ష్మి బాలీవుడ్ నటుడు  అఫ్తాబ్ శివదాసని తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.

రీసెంట్ గా ‘పాయిజన్ 2’ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఫ్తాబ్ ను కౌగిలించుకొని రాయ్ లక్ష్మి ఒక హాట్ పోజ్ లో దాదాపు అన్ డ్రెస్డ్ గా రివీలైంది. విశాల్ పాండ్యా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పాయిజన్ 2’ వెబ్ సిరీస్ ను పనోరమా ఎంటర్ టైన్  మెంట్స్ బ్యానరపై సుజనా ఘాయ్ నిర్మిస్తున్నారు. రివెంజ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ అఫ్తాబ్ శివదాసనికి కూడా డెబ్యూ వెబ్ సిరీస్ అవడం విశేషం.

Leave a comment

error: Content is protected !!