Shopping Cart 0 items - $0.00 0

హనుమాన్ జంక్షన్

 

 

జగపతి బాబు సినీ కెరీర్ లో మరచిపోలేని ఫ్యామిలీ అండ్ యాక్షన్ మల్టీస్టారర్ ‘హనుమాన్ జంక్షన్’ . జయం రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ మెయిన్ హీరోగా నటించాడు. ఇక ఇందులోనే ఒక కామెడీ పాత్రను వేణు పోషించాడు. స్నేహ, లయ, ఎల్బీశ్రీరామ్, ఆలీ, కోవై సరళ, జయప్రకాశ్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటించి మెప్పించారు. సురేశ్ పీటర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. 2001 డిసెంబర్ 21న విడులైన ఈ సినిమా  2000 లో మలయాళంలో విడుదలైన ‘తెన్ కాశీపట్టణం’ సినిమాకి రీమేక్ అవడం విశేషం. రఫీ మెకార్టిన్ డైరెక్షన్ లో సురేశ్ గోపి, లాల్ , దిలీప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంలో హైయస్ట్ గ్రాసర్ గా నిలిచిపోయింది. ఇదే సినిమాను తమిళంలో  తెన్ కాశీపట్నంగా  రీమేక్  అయి.. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక హనుమాన్ జంక్షన్ క్లైమాక్స్ సీన్ లో అద్భుతమైన కామెడీ వర్కవుట్ అయి సినిమా సక్సెస్ కు మరింత అడ్వాంటేజ్ అయింది. . జగపతిబాబు, అర్జున్ ప్రాణస్నేహితులు గా నటించిన ఈ సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల్నిఅలరిస్తూనే ఉంది.  

Leave a comment

error: Content is protected !!