తమిళ హీరో సూర్య పవర్ ఫుల్ పాత్రలో గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో తెరెక్కుతోన్న యాక్షన్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఆకాశం నీ హద్దురా’.  ‘సురారై పోట్రు’ గా తమిళంలో వస్తున్న ఈ సినిమా లో మలయాళ కుట్టి అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తోంది. మొన్నామధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈ రోజు ఈ సినిమాలోని ‘ఫిల్ల పులి’ అనే పాట ప్రోమో ను విడుదల చేశారు మేకర్స్.

జీవి ప్రకాశ్ సంగీత సారధ్యంలోని ఈ పాట లోని రొమాంటిక్ ఫీలింగ్ ను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. విలక్షణ నటుడు మోహన్ బాబు ఓ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తోన్న ఆకాశం నీహద్దురా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గురు’ మూవీతో సుధకొంగర   డైరెక్టర్ గా తన బ్రిలియన్సీని ప్రూవ్ చేసుకున్న నేపథ్యంలో ఆకాశం నీ హద్దురా సినిమామీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా సూర్య కి ఏ స్థాయిలో ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

ప్రోమో సాంగ్ కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=-kBit9s_J44

Leave a comment

error: Content is protected !!