తెలుగు సినీ రంగంలో చాలా మంది దర్శకులు… డబ్బు కోసమే సినిమాలు తెరకెక్కించేవారు. తాను ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికే దర్శకత్వ రంగాన్ని ఎన్నుకొనేవారు. అయితే కొందరు మాత్రం .. సినిమా మీద మక్కువతోనే పనిచేసేవారు. సినిమా బాగా రావడానికే అహర్నిశలూ శ్రమించారు. అందులో పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు ఒకరు.
‘నర్తనశాల’ ‘పాండురంగ మహాత్యం’, ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణవిజయం’, గుండమ్మకథ, లాంటి హిట్ చిత్రాలను డైరక్టు చేసిన కమలాకర కామేశ్వరరావుకు సొంత కారు, ఇల్లూ లేవు. ఆయన దగ్గర సహాయకులుగా పనిచేసిన వాళ్లు కార్లు కొనుక్కున్నారు. పెద్ద ఇళ్లు కట్టుకున్నారు. కమలాకర కామేశ్వరరావుకు పారితోషికాలు తక్కువ. ఎంత ఇస్తే అంతే! ‘‘మంచి సినిమా తయారు కావాలిగాని, పారితోషికం ప్రధానం కాదు’’ అనేవారు. రజతోత్సవం జరుపుకున్న ‘నర్తనశాల’ (1963)కి ఆయన పారితోషికం పదిహేను వేలు!దటీజ్ .. కమలాకర కామేశ్వరరావు .