కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ‘మనకోసం’ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. కరోనా విపత్తు కారణంగా కష్టాల్ని ఎదుర్కొంటున్న సామాన్యులకు సినీ తారలు అండగా నిలుస్తున్నారు. విరాళాలు, నిత్యవసర సరుకులు అందించడంతో పాటు వివిధ రూపాల్లో మేమున్నామంటూ ప్రజల్లో కొండంత ధైర్యాన్ని నింపుతున్నారు.
ఇక లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వెయ్యి మందికిపైగా కార్మికులకు సినీ హీరో గోపీచంద్‌ నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకుల్ని స్వయంగా అందజేశారు. అలానే 2 నెల‌ల పాటు 1500 మందితో కూడిన అనాథ ఆశ్ర‌మానికి రోజువారీ ఆహారాన్ని అందిస్తున్నారు. తాజాగా సినీ ప‌రిశ్ర‌మ‌లో దిన‌స‌రి వేత‌నం పొందే కార్మికుల కోసం రూ. 10ల‌క్ష‌ల విరాళాన్ని సీసీసీకి అంద‌జేశారు. గోపిచంద్ ఔదార్యంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Leave a comment

error: Content is protected !!