ఆకర్షించే అందానికి , అందమైన అభినయానికి పెట్టింది పేరు సమంతా . కళ్ళతోనే భావాన్ని పలికించి.. వైవిధ్యమైన హావభావాలతో పాత్రకు జీవం పోసి.. రక్తికట్టించడంలో అమ్మడు పెట్టింది పేరు. ప్రస్తుతం దక్షిణాది కథానాయికల్లో అగ్ర పథాన దూసుకుపోతున్న సమంతా చిత్ర సీమలోకి అడుగుపెట్టి నేటికి పది సంవత్సరాలు పూర్తయింది. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ‘ఏ మాయ చేసావే’ చిత్రంలోని జెస్సీ పాత్రతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది సమంతా.
తొలి చిత్రంలో నటించిన నాగాచైతన్యనే తన జీవిత భాగస్వామిగా చేసుకొని అక్కినేని వారింటి కోడలు అయిన సమంతా.. పెళ్ళయినా ఏమాత్రం తగ్గని జోరుతో టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఒక పక్క ఇక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూనే .. మరొపక్క తమిళంలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. సత్తా చాటుకుంటోంది. లేటెస్ట్ గా ‘జాను’ చిత్రంతో సమంతా.. టాలీవుడ్ ప్రేక్షకులని నోస్టలాజికల్ వేలో ఎంతో ఎమోషనల్ గా టచ్ చేసి.. మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. పదేళ్ళ తన సినీ జెర్నీలో ఎన్నో విజయాలు చవిచూసిన సమంతాకి మూవీ వాల్యూమ్ అభినందనలు తెలుపుతోంది.