పూర్వం సినిమాల్లో  మన నటీనటులు..రీల్ లైఫ్ కి, రియల్ లైఫ్ కి ఉన్న తేడా గుర్తించి మసలుకొనేవారు. చాలా క్రమశిక్షణతో మెలిగేవారు. ముఖ్యంగా సీనియర్ నటులకు అప్పుడప్పుడే వెలుగులోకి వస్తోన్న నటులు చాలా గౌరవించి.. వారి ఆశీర్వాదాన్ని కోరుకొనే రీతిలో వారితో మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేసేవారు. దీనికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిన ఒక సంఘటన.. బాపు , రమణల ‘బుద్ధిమంతుడు’ సినిమా సెట్స్ లో జరిగింది.

‘బుద్ధిమంతుడు’ సినిమాలో గుడి పూజారి అయిన అక్కినేనికి .. శ్రీకృష్ణుడు కనిపిస్తుంటాడు. పరమ భక్తుడైన ఆ పూజారి కి అక్కినేని సేవలు చేసుకుని తరిస్తాడు. అయితే ఒక సన్నివేశంలో అక్కినేని కృష్ణుడి పాత్రధారి అయిన శోభన్ బాబు కాళ్ళు పట్టుకొని .. పాదాలు నొక్కుతూ.. తన భక్తిభావాన్ని ప్రదర్శిస్తారు. నను పాలింపగ నడచీ వచ్చితివా అనే పాటకు సంబంధించిన సన్నివేశం అది. ఆ పాట వస్తున్నంత సేపూ అక్కినేని శోభన్ పాదాలు నొక్కుతూ కనిపిస్తారు. అయితే ఈ సన్నివేశం పూర్తయిన వెంటనే.. శోభన్ .. అక్కినేని పాదాలకు నమస్కరించి.. అపరాధమైంది.  నన్ను క్షమించండి అని అడిగేవారట.  అదీ.. అప్పటి నటుల డెడికేషన్, క్రమశిక్షణ .

Leave a comment

error: Content is protected !!