Shopping Cart 0 items - $0.00 0

శభాష్ తాప్సీ

అందానికి చాలా తక్కువ ప్రిఫరెన్స్ఇచ్చి..  కేవలం పెర్ఫార్మెన్స్ మీదనే ప్రత్యేక దృష్టి పెట్టిన తాప్సీ.. వరుస సినిమాలతో  బాలీవుడ్ లో చాలా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.  లాస్టియర్ ‘బద్లా, మిషన్ మంగళ్, గేమ్ ఓవర్ , సాండ్ కా ఆంఖ్’  చిత్రాలతో మిశ్రమ ఫలితాలు అందుకున్న తాప్సీ ..  ఈ ఏడాది కూడా కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు లైన్ లో పెట్టుకుంది. అందులో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ఒకటి. ఆ పాత్ర కోసం చాలా కష్టపడి క్రికెట్ నేర్చుకొని..  విపరీతమైన ప్రాక్టీస్ చేసింది తాప్సీ.  ‘శభాష్ మితు’ పేరుతో  తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రాహుల్ ధొలాకియా దర్శకుడు .

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మేకర్స్ కొద్ది నిమిషాల క్రితమే ట్విట్టర్ లో విడదల చేశారు. బ్యాట్ చేత పట్టుకొని మిథాలీరాజ్ పాత్రలో చాలా స్టైలిష్ గా రివీల్ అయింది తాప్సీ. ఆమె పోజును చూస్తుంటే .. మిథాలీ పాత్రతో పాటు .. ఆమె ఆడే స్టైల్ ను కూడా అమ్మడు ఒడిసిపట్టిందని అర్ధమవుతోంది. వవాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ పై ప్రియా అవెన్ నిర్మిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న విడుదల చేస్తూన్నట్టు రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేశారు. బాలీవుడ్ లో ఇప్పటివరకూ ఎంతో మంది క్రికెటర్స్  మీద బయోపిక్స్ వచ్చాయి కానీ.. మొదటి సారిగా ఒక మహిళా క్రికెటర్ జీవిత చరిత్రపై రావడం ఇదే మొదటి సారి. అందుకే ఆమె పాత్రను చేయడానికి అంగీకరించిన తాప్సీని బాలీవుడ్ లో అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.  మరి మిథాలీరాజ్ గా తాప్సీ ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!