తెలుగు చలనచిత్ర రంగంలో ‘శంకరాభరణం’ చిత్రం ప్రత్యేకించి ఒక అధ్యాయం. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు తార్కాణంగా నిలిచిన ఆ సినిమాను మలయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఆరోజుల్లోనే డబ్బింగ్ రైట్స్ కి లక్షా డబ్బై ఐదు వేల రూపాయల్ని చెల్లించాడు ఒక డిస్ట్రిబ్యూటర్. కేరళలోని ఎర్నాకుళంలో రెండేళ్ళాడింది సినిమా. పాటల్ని యాజిటీజ్ అలాగే ఉంచి.. కేవలం సంభాషణల్ని మాత్రమే మలయాళంలోకి తర్జుమా చేశారు. ఇంతకీ ఈ సినిమా వల్ల నిర్మాతకు వచ్చిన లాభమెంతో ఊహించగలరా? అక్షరాలా .. రెండు కోట్ల రూపాయలు అది కూడా నలభై ఏళ్ళ క్రితం. అయితే ఇంత లాభం వచ్చినా.. ఇక్కడో విషాదం జరిగింది. కలలో కూడా ఊహించని లాభానికి ఉక్కిరి బిక్కిరైన ఆ నిర్మాత గుండెపోటుతో మరణించాడు.