పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  టాలీవుడ్ లో వరుస చిత్రాలతో కమ్ బ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ వెర్షన్ (‘వకీల్ సాబ్’ వర్కింగ్ టైటిల్ )  సెట్స్ పై ఉండగానే..  మరో పక్క క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ మూవీను కూడా పట్టాలెక్కించారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్  సెకండ్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. దీనికి ‘విరూపాక్ష’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ పవర్ స్టార్ అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.

మొఘలాయిల పాలనలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ గా ఇందులో  పవర్ స్టార్ నటిస్తోన్న విషయం ఆల్రెడీ రివీలైంది. అయితే అలాంటి పవర్ ఫుల్ పాత్రను ఢీ కొట్టాలంటే..  అవతల కూడా అంతే పవర్ ఫుల్ పెర్సనాలిటీ ఉండాలి కదా. అందుకే  పవన్ కళ్యాణ్  ప్రత్యర్ధిగా బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రామ్ పాల్ ను రంగంలోకి దింపుతున్నాడట క్రిష్. పాన్ ఇండియా కేటగిరిలో ఈ చిత్రాన్ని  బహుభాషల్లో విడుదల చేయడానికి  సన్నాహాలు జరుగుతోన్న నేపథ్యంలో .. అర్జున్ రామ్ పాల్ లాంటి బాలీవుడ్ నటుడు , కీర్తి సురేశ్ లాంటి క్రేజీ కథానాయిక ఈ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరి తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న అర్జున్ రామ్ పాల్ .. ఏ రేంజ్ లో విలన్ గా మెప్పిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!