మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ (వర్కింగ్ టైటిల్ )  సినిమా లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా  సెట్స్ మీద ఉండగానే.. అప్పుడే ఆయన 152 సినిమా గురించి రకరకాల వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలోనే ఆయన తదుపరి చిత్రం ఉంటుందని, అది కూడా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ అని.. ఇలా రకరకాలుగా లీకులు బైటికి వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడి గురించి మరో కొత్త వార్త వినిపిస్తోంది. చిరు 152 ‘లూసిఫర్’ రీమేకే అయితే..  దానికి దర్శకుడిగా వి.వి.వినాయక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.

ఆల్రెడీ చిరు, వినాయక్ ‘ఠాగూర్, ఖైదీనంబర్ 150’ మూవీస్ చేశారు. ఈ రెండూ రీమేక్సే అయినా.. బాక్పాఫీస్ వద్ద దుమ్మురేపేశాయి. అందుకే ‘లూసిఫర్’ ను టాలీవుడ్ లో రీమేక్ చేయడం అంటూ జరిగితే.. ముందుగా సుకుమార్ కు ప్రిఫరెన్స్ ఇస్తారట. అతడు కాని పక్షంలో కచ్చితంగా సీన్ లోకి వినాయక్ ను దింపుతారట. ప్రస్తుతం ‘సీనయ్య’ అనే సినిమాలో వినాయక్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ దిల్ రాజు కు సంతృప్తికరంగా రాలేదట. అందుకే ఆ సినిమాను పక్కనపెట్టాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడని తెలుస్తోంది. ఒక వేళ ఆ సినిమా గానీ ఆగిపోతే.. తాను మళ్ళీ దర్శకుడిగా ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడట వినాయక్ . అందుకే చిరు తో ‘లూసిఫర్’ తెరకెక్కించే  ఛాన్స్ వస్తే వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు..ఈ ఛాన్స్  మిస్సయినా చిరంజీవి వినాయక్ తో మరో మాస్ సినిమా చేయాలనుకుంటున్నాడట. మరి చిరు ‘లూసిఫర్’ దర్శకుడు ఎవరవుతారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!